టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్ అనిపించుకోవడమే కాదు చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వెళ్ళిపోయింది. కొత్త సన్నివేశాలు జోడించారు కాబట్టి వీకెండ్ మళ్ళీ ఊపందుకుంటుందనే నమ్మకం బయ్యర్లలో కనిపిస్తోంది. మూడో వారంలో ప్రమోషన్ల పరంగా టీమ్ సైలెంట్ అయిపోవడం కొంత మేర ప్రభావం చూపిస్తోంది. థియేటర్ రన్ కోణంలో ఇది చివరి వారమని చెప్పొచ్చు.
ఇప్పుడు కొత్త శుక్రవారం వచ్చేసింది. పెద్ది మొదలుపెట్టిన జోష్ ని కొనసాగించేందుకు మా ఇంటి బంగారం నడుం బిగించింది. టాక్ ఇంకా బయటికి రాకముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అయిదు కోట్ల మార్కు దాటేయడం సమంత క్రేజ్ తో పాటు కమర్షియల్ కంటెంట్ పట్ల జనం ఎంతగా మొహం వాచిపోయి ఉన్నారో తెలియజేస్తోంది. ఓవర్సీస్, హైదరాబాద్ ప్రీమియర్స్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే సమంత ఖాతాలో మరో హిట్టు పడ్డట్టే. ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది.
విజయ్ ఆంటోనీ వంద దేవుళ్ళకు ఏ మాత్రం ఊహించని విధంగా డీసెంట్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్, తల్లి సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. నవీన్ వడ్డే కంబ్యాక్ ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుకు వేసిన స్పెషల్ షోల నుంచి మంచి ప్రయత్నమనే మాట వినిపించింది. మలయాళ డబ్బింగ్ బాలన్ సంగతి తేలాల్సి ఉండగా ఒక రోజు ఆలస్యంగా వస్తున్న దీవానా ప్రీమియర్లు ఇవాళ రాత్రి కీలక కేంద్రాల్లో వేయబోతున్నారు.
ఇవి ఒక ఎత్తు అయితే నగరాల మల్టీప్లెక్సుల్లో బాలీవుడ్ మూవీ కాక్ టైల్ 2కు మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ న్యూ ఏజ్ లవ్ డ్రామాలో ఎంటర్ టైన్మెంట్ కనక వర్కౌట్ అయితే కాసులు కురుస్తాయి. మొత్తానికి థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొనేందుకు ఇవన్నీ ఈ సరిపోతాయి కానీ పబ్లిక్ టాక్ ఎలా ఉండబోతోందనేది కీలకం కానుంది. అన్నీ కంటెంట్ల మీద ఆధారపడినవి కావడం గమనార్షం.
Gulte Telugu Telugu Political and Movie News Updates