మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ వచ్చినప్పుడు సహజంగానే కొంచెం బజ్ తక్కువగా ఉంటుంది. అయితే సమంతకు ఆ ఇబ్బంది రాలేదు. కేవలం తన ఇమేజే ఇంత రెస్పాన్స్ కు కారణమవుతుందాని అడిగితే ఫ్యాన్స్ ఔననే అంటున్నారు. కానీ గతంలో శాకుంతలం, యశోద లాంటి వాటికి ఈ రేంజ్ స్పందన లేదనేది ఒకసారి ఫ్లాష్ బ్లాక్ లోకి వెళ్తే కనిపిస్తుంది.
టికెట్ల అమ్మకాలు ఎందుకు బాగున్నాయనే దానికి కారణాలున్నాయి. సామ్ కు కుటుంబ ప్రేక్షకుల్లో నెలకొన్న ఇమేజ్ అయితే ఖచ్చితంగా పని చేసింది. అది సానుకూలంగా మారింది. మా ఇంటి బంగారం టీమ్ ఎక్కడా తమ సినిమాలో ఎమోషన్లు ఉన్నాయని, మహిళా సాధికారికత గురించి సందేశాలు ఇచ్చామని, అమ్మాయిలకు స్ఫూర్తిగా ఉంటుందని చెప్పలేదు. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు మాస్ జనాలకు కావాల్సిన కమర్షియల్ మసాలాలు ఉన్నాయని ట్రైలర్ లో చూపించింది.
అంటే వేరే రకంగా ప్రొజెక్ట్ చేయకుండా నేరుగా ఒక క్లాస్ కం మాస్ ఎంటర్ టైనర్ ఇస్తున్నామని నేరుగా కమ్యూనికేట్ చేస్తున్నారు. అందుకే సమంత భర్తగా అసలు పరిచయమే లేని యాక్టర్ నటించినా జనం అసలు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. సామ్ ఎందుకు ఫైట్లు చేస్తోంది, దర్శకురాలు నందిని రెడ్డి చెప్పినట్టు బాషా స్థాయి ఫ్లాష్ బ్యాక్ ఏమై ఉంటుందనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇవన్నీ చాలా మేలు చేస్తున్న ప్లస్ పాయింట్స్.
కొంచెం పెద్ది ప్రస్తావన ఇక్కడ అవసరం. ఎంతసేపూ చరణ్ కు జాతీయ అవార్డు వస్తుంది, క్లైమాక్స్ లో కన్నీళ్లతో బయటికి వస్తారని రిపీట్ గా చెప్పడం వల్ల పెద్ది పట్ల ప్రీ ఒపీనియన్ విడుదలకు ముందే మిక్స్డ్ గా మారిపోయింది. ముఖ్యంగా హిందీ, తమిళ రాష్ట్రాల్లో ఇది మిస్ ఫైర్ అయ్యింది. ఓవర్సీస్ లోనూ ఇదే సమస్య. కానీ మా ఇంటి బంగారం అలా చేయలేదు. సింపుల్ గా మొదలై యాక్షన్ తో మురిపించే కంప్లీట్ సినిమా ఇస్తున్నామనే భరోసా జనాలతో టికెట్లను కొనిపిస్తోంది. రేపటికి ఫలితం తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates