Movie News

OG 2 అనుమానాలు తీరిపోయాయి

గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని, దర్శకుడు సుజిత్ అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు నాని బ్లడీ రోమియో కోసం కూడా సుజిత్ సిద్ధమవుతున్నట్టు ఇంకో వార్త చక్కర్లు కొడుతోంది. కమిట్ మెంట్స్ వరస ప్రకారం చూస్తే న్యాచురల్ స్టార్ మూవీనే ముందు స్టార్ట్ అవ్వాలి. అయితే ప్యారడైజ్ ఆలస్యం వల్ల ఓజి 2 పేరు హఠాత్తుగా తెరమీదకు వచ్చింది.

ఇవాళ అరుదైన వ్యాధి బారిన పడిన తన అభిమాని నిరంజన్ ను కలుసుకునేందుకు వరంగల్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆ అబ్బాయితో మంచి సమయం గడపటం జనాన్ని ఆకట్టుకుంటోంది. ఏదో మొక్కుబడిగా కనిపించేసి, రెందు మాటలు చెప్పేసి బయటికి రాలేదు. వాళ్ళకు తృప్తి అనిపించే దాకా అక్కడే ఉండి, యోగక్షేమాలు కనుక్కుని, ఏమేం కావాలో గుర్తు పెట్టుకుని, అన్నీ నెరవేరుస్తానని వీడియోల సాక్షిగా హామీ ఇవ్వడం అభిమానుల మనసులు గెలుచుకుంది.

ఇదిలా ఉండగా నిరంజన్ తో జరిపిన ముచ్చట్లలో భాగంగా పవన్ కళ్యాణ్ ఓజి 2 ప్రస్తావన తెచ్చారు. అది తీస్తే దాని ఈవెంట్ కి నిన్ను ప్రత్యేక అతిథిగా పిలుస్తానని చెప్పడమే కాదు సినిమా కూడా కలిసి చూద్దాం అన్న తరహాలో ప్రామిస్ చేయడం చూసి అతని తల్లితండ్రులకు ఆనంద బాష్పాలు వచ్చినంత పనయ్యింది. ఆ అబ్బాయి కళ్ళలో కూడా ఆ సంతోషం తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపించాయి. అందరిలోనూ ఉద్వేగం కనిపించింది.

ఈ లెక్కన ఓజి 2 ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో తెరకెక్కడం ఖాయమని చెప్పొచ్చు. కాకపోతే సుజిత్ ఈ ఏడాదే తీస్తాడా లేక బ్లాడీ రోమియో పూర్తి చేసుకుని వస్తాడా అనేది ఇంకా వేచి చూడాలి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓజి 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కు సమయం అందుబాటులోనే ఉంది కానీ అనారోగ్యం దృష్ట్యా వెంటనే సెట్స్ పైకి వెళ్లే సాహసం చేయకపోవచ్చు. ఏదైతేనేం ఇంకో ఏడాదిలోనో లేదా అటుపైనో ఓజి 2 రావడం అయితే పక్కా.

This post was last modified on June 17, 2026 2:57 pm

Share

Recent Posts

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

5 hours ago