సినిమాల సక్సెస్ రేట్ పడిపోతోందని.. ఒకప్పట్లా జనం థియేటర్లకు రావట్లేదని ఈ మధ్య మన ఇండస్ట్రీలో తరచుగా ఆవేదన స్వరం వినిపిస్తున్నారు ఫిలిం మేకర్స్. పొరుగు ఇండస్ట్రీ అయిన కోలీవుడ్.. అలాగే దేశంలోనే అతి పెద్ద ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్లోనూ పరిస్థితులు ఏమంత గొప్పగా లేవు. కన్నడ సినీ పరిశ్రమ పరిస్థితీ అంతంతమాత్రమే. కానీ మలయాళంలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నం.
అక్కడి సినిమాల విస్తృతి పెరుగుతోంది. సక్సెస్ రేట్ కూడా తక్కువేమీ కాదు. తక్కువ బడ్జెట్లో, బలమైన కంటెంట్‌తో మలయాళ ఫిలిం మేకర్స్ తీసే సినిమాలు థియేటర్లలో విజయవంతం కావడంతో పాటు ఓటీటీల్లోనూ అద్భుత ఆదరణ దక్కించుకుంటున్నాయి. డివైడ్ టాక్ తెచ్చుకున్న దృశ్యం-3 సినిమా కూడా ఈ ఏడాది ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. దీంతో ఇతర భాషల నుంచి హీరోలు, నిర్మాతలు మాలీవుడ్ వైపు చూస్తున్నారు.
సూర్య ప్రస్తుతం జీతు మాధవన్ అనే మలయాళ దర్శకుడితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు షైన్ స్క్రీన్స్ మలయాళంలో ఏఆర్ఎం, వాళ-2 సినిమాలు నిర్మించి మంచి ఫలితాలను అందుకున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. తన ధర్మ ప్రొడక్షన్స్‌ను మలయాళంలోకి తీసుకెళ్తున్నాడు. అతను మాలీవుడ్ అగ్ర కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్‌తో చేతులు కలుపుతున్నాడు.
వీళ్లిద్దరూ కలిసి నిర్మించే ఒడియన్ అనే సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించనున్నాడు. రాహుల్.. భూతకాలం, భ్రమయుగం లాంటి వెరైటీ హార్రర్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒడియన్ కూడా హార్రర్ టచ్ ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది. ఇందులో పృథ్వీరాజ్, మంజువారియర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. హిందీలో వరుసగా షాక్‌లు తింటున్న కరణ్.. సక్సెస్ కోసం మలయాళంలోకి అడుగు పెడుతున్నట్లున్నాడు. మరి మంచి ఊపుమీదున్న మాలీవుడ్ అతడికి మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.
This post was last modified on June 17, 2026 2:25 pm
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…