రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి – అనిరుద్ రవిచందర్. ఎందుకంటే ఈ కలయికలో గతంలో జెర్సీ, కింగ్డమ్ వచ్చాయి కాబట్టి, మధ్యలో మ్యాజిక్ అనే యూత్ మూవీ ఒకటి తీశారు కనక. అయితే షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా మ్యాజిక్ ని ఇప్పటిదాకా థియేటర్లకు తెచ్చే ప్రయత్నం చేయలేదు నిర్మాత నాగవంశీ. ఈ సినిమా నుంచి ఆల్రెడీ ఒక లిరికల్ సాంగ్ వచ్చి ఏడాది దాటిపోయింది.
దాదాపు అందరూ కొత్త వాళ్ళతో తీసిన మ్యాజిక్ లో దురంధర్ ఫేమ్ సారా అర్జున్ ఒక హీరోయిన్ గా నటించింది. కుర్రకారు, కాలేజీ, సంగీతం, సరదాలు, ఆటల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు కారణాలు ఏమైనా డైరెక్ట్ ఓటిటి రూటు ఎంచుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇంకా నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ దాదాపు ఒప్పందం జరిగిపోయిందని సమాచారం. అదే జరిగితే చాలా కాలం తర్వాత ఒక అగ్ర నిర్మాణ సంస్థ నుంచి డైరెక్ట్ ఓటిటి మూవీ వస్తున్నట్టే.
అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా నిర్ధారించలేం కానీ నిజమైతే మటుకు మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం థియేటర్ రెవిన్యూలు ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. సంక్రాంతి అయిపోయాక నాలుగు నెలల తర్వాత మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపించింది పెద్దితోనే. మధ్యలో హిట్ అనిపించుకున్నవి కూడా సోసో వసూళ్లు తెచ్చినవే. ఇలాంటి టైంలో మ్యాజిక్ లాంటివి ఏదో వసూళ్ల మ్యాజిక్ చేస్తాయని గుడ్డిగా నమ్మడానికి లేదు.
ఒకరకంగా కింగ్డమ్ ఫెయిల్యూర్ కూడా మ్యాజిక్ రూటుని మార్చినట్టు కనిపిస్తోంది. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవెల్ లో సితార సంస్థే నిర్మించిన ఈ సినిమా విజయ్ దేవరకొండకు మరో డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఆ కారణంగా మ్యాజిక్ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయలేమని భావించారో లేక ఓటిటిలో మంచి రేట్ ఇచ్చారో పూర్తి వివరాలు వచ్చాకే తెలుస్తుంది. అయినా మొదటి పాట రిలీజ్ చేశాక ఇంత గ్యాప్ ఇవ్వకుండా ఉంటే మ్యాజిక్ పేరు జనం నోళ్ళలో నానేదేమో.
This post was last modified on June 9, 2026 7:37 pm
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…