Political News

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన పార్టీ అధినేత‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా తొలిసారి ఒకే స‌మ‌యంలో ఇద్ద‌రు నేత‌లుకూడా విశాఖ‌లో ప‌ర్య‌టించారు. సోమ‌వారం సాయంత్రం విశాఖ‌లోని స్టీల్‌ప్లాంట్ జ‌రిగిన ఘోర ప్ర‌మాదంలో 8 మంది మృతి చెంద‌డం తో పాటుప‌లువురు గాయ‌ప‌డ్డారు. వీరిని ప‌రామ‌ర్శించేందుకు ఇరువురు నాయ‌కులు విశాఖ‌లో ప‌ర్య‌టించారు.

రెస్ట్ ప‌క్క‌న పెట్టి..

ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌.. మంత్రి నారా లోకేష్‌.. ఈ రోజు ఉద‌య‌మే.. హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న బ‌డ‌లిక‌తో మంగ‌ళ‌వారం రెస్ట్ తీసుకోవాల‌ని, కుటుంబ స‌భ్యుల‌తో గ‌డ‌పాల‌ని అనుకున్నారు. కానీ, విశాఖ‌లో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌తో ఆయ‌న ఉద‌యం 10 గంట‌ల‌కే హైద‌రాబాద్ నుంచి నేరుగా విశాఖ‌కు చేరుకున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కూడా మంగ‌ళ‌గిరి నుంచి నేరుగా విశాఖ‌కు చేరుకుని.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.

ప‌ని విభ‌జ‌న‌..

విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితుల ప‌రామ‌ర్శ‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు వ‌చ్చినా.. ఇద్ద‌రూ ఎలాంటి గంద‌ర‌గోళానికి తావివ్వ‌కుండా.. ప‌నిని పంచుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. మంత్రి లోకేష్‌.. నేరుగా ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. వారితో మాట్లాడి.. ఓదార్చారు. వారితో క‌లిసి కూర్చుని వారి బాధ‌ను పంచుకున్నారు. బాధిత కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం నూరిపోశారు.

ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మంగ‌ళ‌గిరి నుంచి నేరుగా విశాఖ‌కు చేరుకున్నా.. అక్క‌డి నుంచి ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి వైద్య‌శాల‌లో చికిత్స పొందుతున్న వారి వ‌ద్ద‌కు వెళ్లారు. వారిని ప‌రామ‌ర్శించారు. వారికి అందుతున్న వైద్యాన్ని, ప్ర‌స్తుత ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుల‌తో నేరుగా మాట్లాడి వారి నుంచి కొంత స‌మాచారం తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు.

ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. ఇరువురు నేత‌లు.. వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. నిజానికి ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు నాన్ ప్లాన్‌గా వ్య‌వ‌హ‌రించే ప‌రిస్థితి ఉంటుంది. కానీ, ప‌వ‌న్‌, లోకేష్‌లు బాధితుల ప‌రామ‌ర్శ‌లో భాగం అయ్యే విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని విమ‌ర్శ‌ల‌కు తావులేకుండా వ్య‌వ‌హ‌రించారు.

This post was last modified on June 9, 2026 7:42 pm

Share

Recent Posts

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

50 minutes ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

55 minutes ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

1 hour ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

3 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

4 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

9 hours ago