Movie News

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు ఎంత బాగున్నా సోషల్ మీడియాలో వ్యవహారాలు మాత్రం వేరుగా ఉంటాయి. చెప్పను బ్రదర్ వివాదం వీటికి పునాది వేస్తే తర్వాత జరిగిన రకరకాల పరిణామాలు, ఎన్నికల టైంలో బన్నీ అనుసరించిన వ్యవహార శైలి మరింత ఆజ్యం పోశాయి. ఇది చల్లారే పరిస్థితి ఉన్నట్టు కనిపించినా తర్వాత కథ మళ్లీ మొదటికే వచ్చేది. ఇప్పుడు పెద్ది వంతు వచ్చింది.

గత శుక్రవారం విడుదలైన పెద్దిని అల్లు అర్జున్ చూశాడు. అంతేకాదు ప్రత్యేకంగా రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తుతూ పెద్ద ట్వీట్ పెట్టాడు. దర్శకుడు బుచ్చిబాబు, ఇతర టీమ్ సభ్యులను విష్ చేసినప్పటికీ బావ మీద స్పెషల్ గా కాంప్లిమెంట్స్ కురిపించాడు. మా హీరో బర్త్ డేకి మీవాడు విష్ చేయలేదు, మీ హీరో పుట్టినరోజుకి మేమూ చెప్పలేదు అంటూ సిల్లీగా గొడవలు పడే అభిమానులకు ఇలాంటివి ఆలోచింపజేసేలా ఉంటాయి. వెంటనే కాకపోయినా కొంత మార్పు వస్తుంది.

కాసేపు బన్నీ స్పందన పక్కనపెడితే పెద్ది పట్ల సినీ ప్రముఖుల మౌనం మెగా ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రీమియర్ చూసిన రాజమౌళి, సంజీవ్ రెడ్డి వంగా లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అంతెందుకు ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్న దర్శకుడి గురువు సుకుమార్ ఇంకా నేరుగా రెస్పాండ్ అవ్వలేదు. ఒకరిద్దరు హీరోలు మినహాయించి పెద్ది గురించి ఎక్స్, ఇన్స్టా లో మాట్లాడిన సెలబ్రిటీలు తక్కువగానే ఉన్నారు.

ఎందుకంటే కారణం సింపుల్. బయట మిక్స్డ్ టాక్ నడుస్తోంది. అక్కడ చూస్తేనేమో కలెక్షన్లు బాగున్నాయి. కంటెంట్ లో హెచ్చుతగ్గులు ఉన్న మాట వాస్తవమే. అలాని పాజిటివ్ గా మాట్లాడితే ఒక తంటా సైలెంట్ గా ఉంటే మరో తంటాలా అయిపోయింది కొందరి పరిస్థితి. పెద్ది యునానిమస్ అనిపించుకుందా లేదా అనేది పక్కన పెడితే రామ్ చరణ్ కష్టం స్క్రీన్ మీద స్పష్టంగా కనిపించింది. దాని గురించి అందరూ కాకపోయినా కనీసం కొందరైనా ఓ రెండు మాటలు పంచుకోవాల్సిందని మెగా ఫ్యాన్స్ కోరిక.

This post was last modified on June 9, 2026 7:53 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

55 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

2 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

4 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

4 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago