Movie News

స్పిరిట్ సెట్స్ లో లీకుల టెన్షన్!

పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో స్పిరిట్ ఒకటి. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాకి సంబంధించి అధికారిక అప్డేట్స్ కంటే అనధికారిక లీకులు ఎక్కువగా బయటకు రావడం ఇప్పుడు చిత్ర యూనిట్ కు పెద్ద తలనొప్పిగా మారింది. సాధారణంగా సందీప్ తన సినిమాల విషయంలో చాలా సైలెంట్ గా ఎవరికీ ఏమాత్రం క్లూ ఇవ్వకుండా వర్క్ చేసుకుంటూ వెళ్తాడు.

కానీ స్పిరిట్ విషయంలో అలా జరగడం లేదు. షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ ఏంటి లాంటి కీలకమైన విషయాలు రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఎంత సెక్యూరిటీ పెట్టినా కూడా ఈ రేంజ్ లో సమాచారం బయటకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభాస్ కు ఉన్న కల్ట్ మాస్ ఫాలోయింగ్ తో లొకేషన్స్ స్పాట్స్ ముందే తెలిస్తే ఆయా ప్రాంతాల్లో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం చిత్ర యూనిట్ కు చాలా కష్టమవుతుంది.

వేలాదిగా జనాలు అక్కడికి చేరుకుంటే షూటింగ్ కు అంతరాయం కలగడంతో పాటు, ఎవరైనా వాళ్ల స్మార్ట్ ఫోన్ల ద్వారా యాక్షన్ సీన్స్ రికార్డ్ చేస్తే పరిస్థితి మరింత చేయిదాటిపోతుంది. నెట్టింట ఈ మధ్య ఇలాంటి లీక్స్ వల్ల చాలా పెద్ద సినిమాలు ఇబ్బందులు పడ్డాయి. ఇక్కడ అసలు సమస్య అంతా ప్రభాస్ సరికొత్త లుక్ చుట్టూనే తిరుగుతోంది. ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ను ఒక కొత్త అవతారంలో చూపించడానికి వంగా టీమ్ రేయింబవళ్లు కష్టపడుతోంది.

ముఖ్యంగా ఆ ఫస్ట్ లుక్ తో అభిమానులకు సాలిడ్ కిక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ అజాగ్రత్త వలన ఆ లుక్ లీక్ అయితే మాత్రం మేకర్స్ క్రియేట్ చేయాలనుకున్న అసలైన ఇంపాక్ట్ పూర్తిగా దెబ్బతింటుంది. తన సినిమాల కంటెంట్ ప్రమోషన్స్ విషయంలో సందీప్ రెడ్డి ఎప్పుడూ ఒక పక్కా వ్యూహంతో అడుగులు వేస్తుంటాడు. ఆడియన్స్ కు ఏ టైమ్ లో ఎలాంటి ట్రీట్ ఇవ్వాలో అతనికి బాగా తెలుసు. కానీ సొంత టీమ్ లోని కొందరి నిర్లక్ష్యం వల్ల ఈ తరహాలో ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంటే మాత్రం ఈ డైరెక్టర్ కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ లీకుల మూలాలు ఎక్కడున్నాయో కనిపెట్టి కఠినంగా వ్యవహరిస్తే తప్ప షూటింగ్ ప్రశాంతంగా జరగదు.

This post was last modified on June 4, 2026 11:52 pm

Share

Recent Posts

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

8 minutes ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

20 minutes ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

5 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

7 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

8 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

9 hours ago