Movie News

రణ్వీర్ నిషేధం… హీరోలకు ఒక పాఠం

రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందాల్సిన డాన్ 3 నుంచి తప్పుకోవడం వల్ల నిర్మాతకు 45 కోట్ల నష్టం వచ్చిందని, ఆ కారణంగా ఇండస్ట్రీ నుంచి అతనికి ఎలాంటి సహకారం ఇవ్వకూడదని ప్రెస్ మీట్ మరీ చెప్పడం దుమారం రేపింది. దీంతో రణ్వీర్ లీగల్ బాట పట్టి సంఘానికి నోటీసులు పంపడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

దీంతో తన మీద బ్యాన్ ఎత్తేసినట్టు తాజాగా ప్రకటన వెలువడింది. రణ్వీర్ నెక్స్ట్ సినిమా ప్రళయ్ కు దారి దొరికింది. జాంబీ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోయే ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇప్పటిదాకా రాని డిఫరెంట్ హారర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ఇక డాన్ 3 వివాదానికి వస్తే ఇది మూడేళ్ళ క్రితం ప్రకటించారు. ఫోటో షూట్ గట్రా అయ్యాక స్క్రిప్ట్ దగ్గర ఏవో అభిప్రాయ భేదాలు రావడం వల్ల అడుగులు ముందుకు పడలేదు. అక్కడితో డాన్ 3 కథకు ముగింపు వేశారు.

అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. సదరు నిర్మాణ సంస్థకు రణ్వీర్ సింగ్ వివరణ ఇవ్వాల్సి రావొచ్చు. ఈ ఇష్యూ గురించి ఫర్హాన్ అక్తర్ నేరుగా మీడియాతో మాట్లాడలేదు. అది జరిగితే మరిన్ని విషయాలు బయటికి వస్తాయి. దురంధర్ సక్సెస్ ని ఓర్వలేక కొందరు వెనుక నుంచి ఈ కుట్ర జరిపించారని రణ్వీర్ సింగ్ ఫ్యాన్స్ ఆరోపిస్తుండగా అలాంటిది ఏమి లేదని, రూల్స్ ప్రకారమే చర్యలకు పూనుకున్నామని అసోసియేషన్ చెబుతోంది.

ఇక్కడ హీరోలు గమనించాల్సిన విషయం ఒకటుంది. ఒక సినిమా ఒప్పుకున్నాక వద్దనుకుంటే అదేదో ముందే క్లియర్ గా చెప్పేస్తే బెటర్. ఇలా సంవత్సరాలు గడిచిపోయాక నిర్ణయం తీసుకుంటే ఇబ్బందే. రణ్వీర్ సింగ్ టీమ్ చెబుతున్న వెర్షన్ వేరేలా ఉంది. స్క్రిప్ట్ సంతృప్తికరంగా లేకపోవడంతో పాటు ప్రొడక్షన్ ఆలస్యం చేయడం వల్లే రణ్వీర్ మనసు మార్చుకున్నాడని అంటున్నారు. పూర్తి స్పష్టత రావాలంటే రణ్వీర్ లేదా ఫర్హాన్ ఎవరో ఒకరు పూర్తి ఓపెన్ అవ్వాల్సిందే.

This post was last modified on June 3, 2026 5:28 pm

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

5 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

7 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

7 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

8 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

9 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

10 hours ago