గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే కొన్ని హ్యాండిల్స్ దీనికి ప్రచారం కలిగించడంతో ఫ్యాన్స్ కొంత అయోమయం చెందారు. కానీ అలాంటిదేమి లేదట. ప్రస్తుతం రాకా షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ తర్వాత చేయబోయే లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ ని ఇంకా పూర్తిగా వినలేదట. ఇంకోవైపు తాను హీరోగా నటిస్తున్న డిసి పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ పనుల్లో లోకేష్ చాలా బిజీగా ఉన్నాడు. ఈలోగా గాసిప్ వచ్చేసింది.
చెన్నై వర్గాల కథనం ప్రకారం బన్నీ 23లో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. కూలి ఫ్లాప్ వల్ల రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీస్టారర్ చేతి దాకా వచ్చి జారిపోవడం పట్ల అతను చాలా కసి మీద ఉన్నాడు. ఇలాంటి టైంలో ఐకాన్ స్టార్ ఓకే చెప్పడం పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే ప్యాన్ ఇండియా స్థాయిలో ఉన్న స్టార్ తో చేస్తేనే తన మార్కెట్ మరింత బలపడుతుంది. తానేంటో ఋజువు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడడు.
ఇక రాకా విషయానికి వస్తే చిత్రీకరణ జరుగుతోంది కానీ విడుదలకు సంబంధించి ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ కి పలు ఇంటర్నేషనల్ కంపెనీలు పని చేస్తుండటంతో గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు అట్లీ రాజీ పడే ఉద్దేశంలో లేడు. అందులోనూ కీలక భాగం షూట్ ఇంకా పెండింగ్ ఉంది. దీపికా పదుకునే కాకుండా సెట్లో అడుగు పెట్టాల్సిన హీరోయిన్లు త్వరలో ఎంట్రీ ఇస్తున్నారు. ఎంతలేదన్నా ఈ ఏడాది చివరిలోగా పూర్తయితే గొప్పేనంటున్నారు యూనిట్ సభ్యులు,.
ఇదే నిజమైన పక్షంలో రాకా 2027 వేసవి టార్గెట్ అందుకోలేదు. ఎలాగూ ఆ సీజన్ ని ప్రభాస్ స్పిరిట్, మహేష్ బాబు వారణాసి లాక్ చేసుకున్నాయి. వాటికి రాకాకి ఎక్కువ గ్యాప్ ఉండటం అవసరం. అందులోనూ రాజమౌళి మేకింగ్ తో పోలిక వస్తుంది కాబట్టి రాకా చాలా విషయాల్లో జాగ్రత్త పడాల్సి వస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ విజువల్ ఫాంటసీ గ్రాండియర్ కు సాయి అభ్యంక్కర్ సంగీతం సమకూరుస్తున్నాడు. వచ్చే ఏడాది డిసెంబర్ రిలీజ్ కు ఛాన్స్ లేకపోలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates