గత కొంత కాలంగా కనిపించడం మానేసిన నివేత పేతురాజ్ మళ్ళీ బిజీ అయ్యేలా ఉంది. ఇటీవలే వెంకటేష్ ఆదర్శ కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర దక్కించుకున్న సంగతి తెలిసిందే. టీమ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు కానీ షూటింగ్ లో ఆల్రెడీ చేరిపోయిందని సమాచారం. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ తరహాలో క్యారెక్టర్ అంటున్నారు కానీ దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. నివేత పేతురాజ్ గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో నటించడం విదితమే.
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ అమ్మడికి ఇంకో మెగా ఆఫర్ వచ్చిందట. చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మాఫియా యాక్షన్ డ్రామాలో నివేత పేతురాజ్ కి అవకాశం దక్కిందని వినికిడి. దీనికి కూడా అధికారిక ధ్రువీకరణ లేదు కానీ ఫిలిం నగర్ వర్గాలు బలంగానే చెబుతున్నాయి. పాత్ర తాలూకు డీటెయిల్స్ అంతగా లేవు కానీ జర్నలిస్ట్ తరహాలో ఉంటుందని అంటున్నారు. ఏదైనా చిరంజీవి మూవీ అంటే ఈ పరిస్థితుల్లో లక్కీ లాటరీ అని చెప్పాలి.
వీటిలో ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2 విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ ఇంకా మీడియా, అభిమానులకు కన్ఫర్మ్ చేయలేదు కానీ దానికి అనుగుణంగానే వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతిని వదులుకోరు. పట్టుబట్టి మరీ పూర్తి చేస్తారు. ఎలాగూ వెంకీ సహకారం ఉంటుంది కనక అదేమీ అసాధ్యం కాదు. నివేత డేట్లు మరీ ఎక్కువ అవసరం లేకపోవడంతో ఆగస్ట్ కల్లా తన భాగం పూర్తవుతుందని అంటున్నారు.
చిరంజీవి బాబీ మూవీకి మాత్రం కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. ఇటీవలే ప్రారంభోత్సవం చేసి మరుసటి రోజే అవుట్ డోర్ కి వెళ్లిపోయారు. ఇందులో మెగాస్టార్ భార్యగా ప్రియమణి, కూతురిగా అనస్వర రాజన్ కనిపించనున్నారు. మరి నివేతకిచ్చిన క్యారెక్టర్ వర్తమానంలో ఉంటుందా లేక ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందానేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆ మధ్య వ్యక్తిగత కారణాల వల్ల మీడియాకు కూడా కనిపించకుండా వెళ్ళిపోయిన నివేత ఇకపై కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుందేమో చూడాలి.
This post was last modified on May 26, 2026 5:43 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…