సీనియర్ నటుడు జగపతిబాబు కెరీర్లో ఎక్కువగా చేసినవి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే. 90వ దశకంలో ఆయన చేసిన ‘శుభలగ్నం’ సహా పలు చిత్రాలతో కుటుంబ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా లేడీస్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఐతే హీరోగా అవకాశాలు తగ్గిపోయి ఖాళీ అయిపోతున్న టైంలో ఆయన ‘లెజెండ్’ మూవీతో విలన్ అవతారం ఎత్తాడు. ఆపై విలన్‌గానే కాక క్యారెక్టర్ రోల్స్‌తోనూ మెప్పిస్తూ సాగిపోతున్నారు. ‘పటేల్’ లాంటి చిత్రాల్లో అప్పుడప్పుడూ లీడ్ రోల్స్ చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు.
ఐతే ఇప్పుడు జగపతి లీడ్ రోల్‌లో ‘వదలా’ అనే సినిమా వస్తోంది. ఒకప్పుడు ‘మనోహరం’లో జగపతికి జంటగా నటించిన లయ ఇందులో ఆయన సరసన నటించడం విశేషం. ఐతే ఇందులో ఇంకో అమ్మాయి పాత్ర కూడా ఉంది. జగపతి ఇందులో వయసుకు తగ్గట్లే మిడిలేజ్డ్ రోల్‌లో కనిపించనుండగా.. అంత పెద్ద వయస్కుడిని ప్రేమించే టీనేజీ అమ్మాయి పాత్రలో హృతిక శ్రీనివాస్ నటించింది.
‘వదలా’ అనే టైటిల్ చూస్తే ఇదేదో దయ్యం క్యారెక్టర్ మనిషిని వదలా అని అంటున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ కథ వేరు. తన కంటే వయసులో చాలా పెద్ద వాడిని ప్రేమించి, నిన్ను వదలా అంటూ తన వెంటపడే అమ్మాయి స్టోరీలా ఉంది. ఈ కాన్సెప్ట్‌కు తగ్గట్లే జగపతి, హృతికల మీద ఒక రొమాంటిక్ టచ్ ఉన్న పాటను కూడా తీశారు.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో జగపతి చాలా స్టైలిష్‌గా కనిపించగా.. నిన్ను వదలా అంటూ ఆయన వైపు కసిగా చూసే అమ్మాయిగా హృతిక కనిపించింది.
కానీ రెండు క్యారెక్టర్ల మధ్య ఏజ్ గ్యాప్ అదీ చూస్తే.. ఈ కాన్సెప్ట్ మన ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా జగపతికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయనకు ఇలాంటి పాత్రను ఇవ్వడం, ఇలాంటి కాన్సెప్ట్‌లో నటింపజేయడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఐతే కేవలం ప్రోమోలు చూసి ఒక అంచనాకు రాలేం కాబట్టి.. సినిమాలో ఇంతకుమించి, భిన్నంగా ఏమైనా చూపించి దర్శకుడు మెప్పిస్తాడేమో చూడాలి. ఆకెళ్ల వి.కృష్ణ రూపొందించిన ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. కిషోర్ నాయుడుతో కలిసి నిర్మించారు.
This post was last modified on May 20, 2026 7:23 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఇమేజ్‌పై ఆయన మేనకోడలి పెళ్లి…
ఎవరి పేరు చెబితే.. రాజకీయ నేతల నుంచి అధికారుల వరకు వణికిపోయేవారో.. అలాంటి వ్యక్తి చోటా రాజన్. మూడు దశాబ్దాల…
రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో బాలికపై అమానుష దాడి ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇప్పుడు 76 ఏళ్లు. ఈ వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర ఆయన చూపిస్తున్న హవా అసామాన్యం. తమిళంలో…
గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత తెరమీద వయొలెన్స్ వికృత రూపాలు దాల్చింది. హత్యలు ఎంత దారుణంగా చేయొచ్చో…
బాలీవుడ్లో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ గుప్తా హఠాత్తుగా చనిపోయారు. ఆయన వయసు 57 ఏళ్లే.…