Movie News

లుగర్ తారక్ అయితే అసలు ఆ డ్రాగన్ ఎవరు?

ఎన్టీఆర్ కొత్త సినిమా గ్లింప్స్ రాకముందు వరకు అందరి మైండ్ లో ఒకటే ఫిక్స్ అయి ఉంది. సినిమా టైటిల్ తో పాటే హీరో పేరు కూడా డ్రాగన్ అనుకున్నారు. కానీ నిన్న రాత్రి వచ్చిన వీడియో చూశాక లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఇందులో తారక్ పాత్ర పేరు లుగర్ అని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో అసలు డ్రాగన్ అంటే ఏంటి, ఆ పేరుకు వెనుక ఉన్న మిస్టరీ ఏంటనే కొత్త చర్చ మొదలైంది.

వీడియోలో చూపించిన ప్రపంచం బట్టి ఒక థియరీ గట్టిగా వినిపిస్తోంది. కథ మొత్తం ఓపియం మాఫియా చుట్టూ తిరుగుతుందని అర్థమైంది. ఈ మాదకద్రవ్యాల గ్లోబల్ నెట్ వర్క్ ను సింబాలిక్ గా డ్రాగన్ అని పిలుస్తారేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ లాంటి వాటన్నింటికీ బాస్ గా వ్యవహరించే ఒక పెద్ద సిండికేట్ పేరు డ్రాగన్ కావొచ్చు. దాన్ని అంతం చేయడమే హీరో టార్గెట్ అయ్యుండొచ్చు.

మరో కోణంలో ఆలోచిస్తే, డ్రాగన్ అనేది ఎన్టీఆర్ మరో పవర్ఫుల్ క్యారెక్టర్ కావొచ్చని కూడా ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అంటే డబుల్ రోల్ అనేలా. లుగర్ ఆఫ్ఘన్ కంపెనీకి అసాస్సిన్ ఇన్ చీఫ్ గా పని చేస్తున్నాడు కదా. అంటే ఆ కంపెనీకి పైన, ప్రపంచ దేశాలను కంట్రోల్ చేసే ఒక అన్ సీన్ క్యారెక్టర్ ఉండి ఉంటాడు. అతన్నే డ్రాగన్ అని పిలిచే ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే నిజమైతే, డబుల్ యాక్షన్ లో ఆ క్లాష్ మామూలుగా ఉండదు.

ఇవేవి కాకుండా మరో ఆసక్తికరమైన పాయింట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో ప్రయాణం ఎప్పుడూ ఒక సామాన్యుడిగా మొదలై ఒక రాక్షసుడిగా మారుతుంది. ఇక్కడ కూడా లుగర్ మొదట్లో ఒక కిల్లర్ గా మాత్రమే పరిచయం అవుతాడేమో. ఆ తర్వాత తన శత్రువులను ఎదుర్కొనే క్రమంలో తనే ఒక పెద్ద డ్రాగన్ గా మారతాడనే లాజిక్ కూడా బాగానే కనెక్ట్ అవుతోంది.

నిజానికి ఇక్కడే దర్శకుడి అసలు మాస్టర్ మైండ్ దాగుంది. కథ ఏంటో, విలన్లు ఎవరో ముందే చూపించేసి తాను పెద్ద రిస్క్ తీసుకున్నట్లు అందరిని నమ్మించాడు. కానీ సినిమాకు ప్రాణమైన టైటిల్ జస్టిఫికేషన్ ను మాత్రం చాలా సీక్రెట్ గా దాచేశాడు. సస్పెన్స్ అంతా రివీల్ చేశాను కదా అనుకునేలోపే, ఈ ఒక్క చిన్న ట్విస్ట్ తో ఆడియన్స్ కు పెద్ద పజిల్ ఇచ్చాడు.

ఏదేమైనా లుగర్ వర్సెస్ డ్రాగన్ అనే టాపిక్ ఇప్పుడు జనాలకు బాగా కిక్ ఇస్తోంది. పేరులో ఉన్న ఈ మిస్టరీ వల్లే గ్లింప్స్ లోని ప్రతి ఫ్రేమ్ ను ఫ్యాన్స్ తీక్షణంగా గమనిస్తున్నారు. 2027 లో రిలీజ్ అయ్యేలోపు దీనిపై మేకర్స్ ఏదైనా హింట్ ఇస్తారో లేదో చూడాలి.

This post was last modified on May 20, 2026 4:45 pm

Share

Recent Posts

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

1 hour ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

1 hour ago

ఔరా అవినాష్‌… పోలీసుల‌తో చెల‌గాట‌మా?!

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పోలీసుల‌తో…

2 hours ago

రాకా రికార్డులు అప్పుడే మొదలైపోయాయి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న రాకా విడుదల చాలా దూరంలో ఉండగానే రికార్డుల వేట…

3 hours ago

‘లస్ట్’ కథలు ఈసారి బెస్ట్ కాలేదా

కామం కాన్సెప్ట్ మీద తీసిన వెబ్ సిరీస్ గా లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ కు విపరీతమైన ఆదరణ దక్కింది.…

4 hours ago

హిందీ ప్రేక్షకులకు ఇరుముడి నచ్చేసింది

మన తెలుగు సినిమాలు ఏపీ తెలంగాణలో ఎంత బ్లాక్ బస్టర్ అయినా హిందీ లో థియేట్రికల్ గా వర్కౌట్ చేసిన…

8 hours ago