Movie News

వీరభద్రుడు చాలా మాస్ ఉన్నాడు

సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు మూడు రోజులు తర్జన భర్జన పడినప్పటికీ ఫైనల్ గా చెప్పిన డేట్ కే థియేటర్లకు తీసుకొస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. సూర్యతో పాటు తమ్ముడు కార్తీ గెస్టుగా వచ్చారు. తెలుగు మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టే ఈ బ్రదర్స్ ఈసారి టైం ఎక్కువ లేకపోవడంతో ఒక వేడుకతో అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు.

ట్రైలర్ లో కథేంటో చెప్పేసారు. రౌడీల్లాంటి లాయర్లతో కోర్టుని తన కనుసన్నల్లో నడిపించే దుర్మార్గుడు బేబీ కృష్ణ (ఆర్జె బాలాజీ). అమాయకులైన ఒక తండ్రి కూతురుకి న్యాయం చేస్తానని చెప్పి కేసు తీసుకుని మోసం చేస్తాడు. చావే గతి అనుకున్న వాళ్ల కోసం నల్లకోటు వదిలేసిన వీరభద్ర(సూర్య) తిరిగి వస్తాడు. వాదించడమే కాదు నేరం చేస్తే కత్తి పట్టుకుని నరికేసే మనస్తత్వం తనది. మరి బేబీ కృష్ణ ఆగడాలకు ఎలా చెక్ పెట్టాడనేది తెరమీద చూడాలి.

స్టోరీ పరంగా మరీ కొత్తదనం అనిపించదు కానీ జాలీ LLB సిరీస్ ఛాయలు కొన్ని ఉన్నాయి. కాకపోతే మాస్ ట్రీట్ మెంట్ తో పాటు దైవత్వానికి సంబంధించిన అంశాలు జోడించిన ఆర్జె బాలాజీ ఒక సస్పెన్స్ ఎలిమెంట్ మాత్రం ట్రైలర్ లో చూపించకుండా దాచి పెట్టాడు. అదే చివర్లో వచ్చే తెల్లమీసాల పెద్దాయన షాట్ దానికి సంబంధించినదే. సాయి అభ్యంకర్ సంగీతం సమకూర్చిన వీరభద్రుడులో హీరోయిన్ త్రిష. రెండు మూడు సీన్లలో చూపించారు.

ఇంత తక్కువ గ్యాప్ లో వీరభద్రుడు ఓపెనింగ్స్ ఏ స్థాయిలో తెచ్చుకుంటుందో చూడాలి. ఒక అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా తెలుగులో పెద్ద స్టార్ హీరో కమర్షియల్ సినిమా రాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది కానీ డిజాస్టర్ కావడం వల్ల ట్రేడ్ లాభపడలేదు. సో ఆ గ్యాప్ ని కనక వీరభద్రుడు వాడుకుంటే కలెక్షన్లు బాగా వస్తాయి. చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు కాబట్టి బాగుందనే టాక్ వస్తే చాలు సూర్యకి హిట్టు పడ్డట్టే.

This post was last modified on May 11, 2026 10:32 pm

Share

Recent Posts

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

1 hour ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

3 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

3 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

4 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

4 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

5 hours ago