తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కొన్ని రోజుల పాటు నడిచిన డ్రామాకు ఆదివారం తెరపడి, ఆదివారం నాడు తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం అసెంబ్లీలో విజయ్‌తో పాటు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
చాలా ఏళ్ల పాటు తమిళ సినీ రంగంలో సహ నటులుగా ఉన్న విజయ్, ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో ప్రభుత్వ అధినేత, ప్రతిపక్ష నేతలుగా ఎలా వ్యవహరిస్తారు.. తొలి రోజు వారి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఐతే ఇద్దరి మధ్య వాతావరణం అంత సానుకూలంగా కనిపించలేదు. ముఖ్యంగా విజయ్ పట్ల ఉదయనిధి వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.
విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో చాలా సమీపంలోనే ఉన్న ఉదయనిధి.. ముఖం ఒక వైపు తిప్పుకుని ఈ వ్యవహారంతో తనకేమీ పట్టనట్లు ఉండిపోయాడు. ఆ సమయంలో అతనంత సీరియస్‌గా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు ఉదయనిధి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో విజయ్ మాత్రం చిరు మందహాసంతో అతణ్నే చూస్తూ ఉన్నాడు.
కానీ ఉదయనిధి మాత్రం మైక్ దగ్గరికి వచ్చినపుడు కానీ.. ప్రమాణ స్వీకారం చేస్తున్నపుడు, కానీ వెళ్లేటపుడు కానీ విజయ్ వైపే చూడలేదు. అప్పుడు కూడా అతను చాలా గంభీరంగా కనిపించాడు. ప్రతిపక్ష నేతగా విజయ్‌ను గట్టిగా ఢీకొట్టాలని ఉదయనిధి భావిస్తుండొచ్చు కానీ..
చాలా ఏళ్లు విజయ్ ఉన్న ఫిలిం ఇండస్ట్రీలోనే తానూ ఉన్నాడు కాబట్టి.. సభలో తొలి రోజు కొంచెం నవ్వుతూ, విజయ్‌తో కలివిడిగా ఉండాల్సిందని.. అతనేదో బద్ధ శత్రువు అయినట్లు ఇప్పుడే ఇంత సీరియస్ అయిపోవాల్సిన అవసరమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఐతే సభలో ఇలా ఉన్న ఉదయనిధి.. విజయ్ వచ్చి తన తండ్రి స్టాలిన్‌ను కలిసినపుడు మాత్రం అక్కడ మామూలుగానే ఉన్నాడు.
This post was last modified on May 11, 2026 10:15 pm
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…