ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి మార్చారు. నార్త్ మీడియా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టనుంది. నార్త్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్న జియో స్టూడియోస్ ప్రత్యేక ప్లానింగ్ తో అంచనాలు పెంచే ప్రయత్నంలో ఉంది. ఎలాగూ బాలీవుడ్ బాక్సాఫీస్ కూడా కాసింత డల్ గానే ఉంది. ఈ అవకాశాన్ని కనక సరిగ్గా వాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఉత్తరాదిలోనూ వసూళ్ల వర్షం కురిపించుకోవచ్చు.
ఒకరకంగా చెప్పాలంటే పెద్ది ట్రైలర్ మీద వందల కోట్ల బరువుంది. ఇప్పటికే కావాల్సినంత హైప్ ఉంది కానీ దీనికి పెట్టిన పెట్టుబడుల కోణంలో చూసుకుంటే కనీసం పది రోజులు భీభత్సంగా ఆడాలి. ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు వస్తాయి కనక టెన్షన్ లేదు కానీ తెలంగాణలో పర్మిషన్లు ఇస్తారా లేదానేది సస్పెన్స్ గానే ఉంది. ముందు రోజు స్పెషల్ ప్రీమియర్లకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదంతా మే చివరి వారంలో తేలనుంది.
మన దగ్గర హైప్ ఇబ్బంది లేదు కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ట్రైలర్ చాలా కీలక పాత్ర పోషించనుంది. దర్శకుడు బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధతో కట్ చేయించాడని ఇప్పటికే టాక్ ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. ఒక్క తెలుగు వెర్షన్ నుంచే రెండు వందల కోట్ల దాకా థియేటర్ బిజినెస్ జరుగుతుందని ప్రాథమికంగా వినిపిస్తున్న మాట. అంతకన్నా ఎక్కువే అయినా ఆశ్చర్యం లేదు. అంటే బ్రేక్ ఈవెన్ గ్రాస్ దీనికి రెట్టింపు రావాలి.
ట్రైలర్ నిడివి ఎంత ఉందనేది పక్కన పెడితే ఇప్పటిదాకా క్రికెట్, కుస్తీ లాంటి ఆటలు ఉంటాయని చూపించడం తప్ప కథేంటో ఎక్కడా రివీల్ చేయలేదు. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యెందు శర్మ పాత్రలకు సంబంధించి ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు. కేవలం రామ్ చరణ్ తోనే ఇక్కడిదాకా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ప్రమోషన్ల విషయంలో దూకుడు లేదని తెగ ఫీలవుతున్న మెగా ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచే బాధ్యత కూడా ట్రైలర్ మీదే ఉంది. చూడాలి మరి ఎలా ఉంటుందో.
This post was last modified on May 11, 2026 11:07 pm
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…