‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె తెలుగులో ‘బద్రి’ చిత్రంలో నటించి ఇక్కడా మంచి పాపులారిటీ సంపాదించింది. ఫ్లాప్ అయిన ‘నాని’ సినిమాతోనూ అమీషా గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఇక హిందీలో అమీషా నటించిన ‘గదర్’ కూడా బ్లాక్‌బస్టర్.
రెండు దశాబ్దాల తర్వాత ‘గదర్-2’ చిత్రంలో నటిస్తే అది కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా ఇప్పటికీ ఉనికిని చాటుకుంటున్న అమీషా.. ఈ తరం యువ కథానాయికలపై మండి పడుతూ ట్విట్టర్లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశం అయింది. ఇప్పటి హీరోయిన్లు రెండు సినిమాలు చేయగానే పెద్ద స్టార్లు అనుకుంటున్నారని.. పీఆర్ స్టంట్లు చేస్తున్నారని ఆమె విమర్శలు గుప్పించింది.
‘‘చాలామంది హీరోయిన్ల కెరీర్లలో ఒక్క పెద్ద హిట్టు కూడా ఉండదు. వారి మొత్తం కెరీర్లలో 200 కోట్ల సినిమా ఒక్కటీ చేసి ఉండరు. కానీ పీఆర్ టీమ్స్‌కు డబ్బులు ఇచ్చి తమను తాము నంబర్ వన్, నంబర్ టూ అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. 2026లో 100 కోట్ల సినిమా అన్నది పెద్ద విషయమే కాదు. ఒక హీరో లేదా హీరోయిన్ పెద్ద హిట్ ఇస్తేనే స్టార్ అవుతారు. భారీ హిట్లు కొడితేనే సూపర్ స్టార్లు అవుతారు. మీ పీఆర్ గిమ్మిక్కులు కట్టిపెట్టండి.
కహోనా ప్యార్ హై, గదర్, గదర్-2 చిత్రాలతో నేను మూడు భారీ బ్లాక్‌బస్టర్లు ఇచ్చాను. మూడు చిత్రాలతో హైయెస్ట్ ఫుట్ ఫాల్స్ సాధించిన కథానాయికను నేను. కానీ నాకు మిగతా వాళ్ల లాగా ఫేక్ పీఆర్ ప్రచారం లేదు’’ అని అమీషా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘గదర్’ ఫ్రాంఛైజీలో మూడో సినిమా కూడా వస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేసిన అమీషా.. దాని కోసం మంచి స్క్రిప్టు రెడీ అవుతోందని, ఆ సినిమా కూడా భారీ విజయాన్నందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
This post was last modified on May 9, 2026 5:33 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…