దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో అంశం కూడా వచ్చి చేరింది. ఆదివారం హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ.. జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్తారని ప్రధాని కార్యాలయ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం కేంద్రంలోనూ.. ఏపీలోనూ ఎన్డీయే కూటమిలో జనసేన పార్టీ ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరు ఎంపీలతో జనసేన కేంద్రంలోని మోడీకి మోడీ సర్కారుకు జనసేన దన్నుగా ఉంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ-పవన్ ల మధ్య అనుబంధం కూడా ఉంది. సనాతన ధర్మ దీక్ష చేసినప్పుడు.. ఏపీకి తరచుగా పర్యటనలకు వచ్చినప్పుడు కూడా పవన్ కల్యాణ్‌ను మోడీ ప్రశంసించిన విషయం తెలిసిందే. అలాగే.. ఎన్డీయే కూటమి విషయంలోనూ.. పవన్ కల్యాణ్ బలంగా నిలబడ్డారు. కాగా.. ఇటీవల అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్.. ముక్కుకు ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్‌లోని నివాసంలోనేరెస్టు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ.. తాజా పర్యటన క్రమంలో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించనున్నట్టు తెలిసింది.
బాబు ఇంటికి కూడా..
అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి కూడా ప్రధాని మోడీ వెళ్లనున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం చంద్రబాబు ఇంటి వద్ద.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలానే.. ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహిం చారు. దీంతో ప్రధాని మోడీ.. చంద్రబాబు నివాసానికి కూడా వెళ్తారని సమాచారం. చంద్రబాబు సైతం.. ప్రధానిని తరచుగా కొనియాడుతున్న విషయం తెలిసిందే. అలానే.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ-బాబుల మధ్య కూడా బంధం బలంగానే ఉంది.
This post was last modified on May 9, 2026 11:00 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…