Political News

విజయ్ ప్రభుత్వం వెనుక స్టాలిన్ వ్యూహం

తమిళ‌నాడు రాజ‌కీయాల్లో చిత్ర‌మైన వైఖ‌రి క‌నిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ ద‌క్క‌లేదు. దీంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే విష‌యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ముఖ్యంగా 108 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్న టీవీకే కూడా మ‌రో 10 మంది మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో ఆప‌శోపాలు ప‌డుతోంది. ఈ క్ర‌మంలో రాజ‌కీయ వైరి ప‌క్షంగా ఉన్న డీఎంకేనే .. ఇప్పుడు విజ‌య్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు స‌న్నాహాలు చేస్తోంది.

త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అండ‌గా ఉన్న సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్‌, వీసీకే పార్టీల‌ను విజ‌య్‌కు మ‌ద్ద‌తు ఇచ్చేలా డీఎంకే అధినేత‌, ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి స్టాలిన్ తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్నారు. ఇచ్చింది తీసుకుని.. మ‌ద్ద‌తు తెలపాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో విజ‌య్‌కు మార్గం సుగ‌మం అవుతున్న‌ట్టు తెల‌స్తోంది. అయితే.. ఎన్నిక‌ల వేళ టీవీకేపై డీఎంకే అధినేత స్టాలిన్‌, ఇటు స్టాలిన్‌పై విజ‌య్ నిప్పులు చెరిగారు.

త‌న పోరు డీఎంకేతోనే ఉంటుంద‌ని విజ‌య్ ఎన్నిక‌ల సమ‌యంలోనే స్ప‌ష్టం చేశారు. అంకుల్‌-అంకుల్ అంటూ.. స్టాలిన్‌ను విజ‌య్ ఆట‌ప‌ట్టించారు. విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, స్టాలిన్ కూడా.. న‌టుల‌కు రాజ‌కీయాలు ఏం తెలుస్తాయి? అని ఎద్దేవా చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు మాత్రం అనూహ్యంగా విజ‌య్‌కు ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేలా తెర‌వెనుక మంత‌నాలు సాగిస్తున్నారు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది రాజకీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇవీ.. ప్ర‌ధాన కార‌ణాలు..

1) స్టాలిన్‌కు అనుకూలంగా ఉన్న పార్టీలు.. విజ‌య్‌కు మ‌ద్ద‌తు తెలిపితే.. రేపు సీఎం అయిన త‌ర్వాత త‌న విష‌యంలో విజ‌య్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉండ‌ద‌న్న‌ది స్టాలిన్ ప్ర‌ధాన ఆలోచ‌న‌.

2) తాను అధికారంలోకివ‌చ్చాక‌.. డీఎంకే అవినీతి ప‌రుల‌ను జైలుకు త‌ర‌లిస్తానని విజ‌య్ చెప్పారు. ఇప్పుడు స్టాలిన్ మ‌ద్ద‌తు పార్టీలు త‌న కూట‌మిలో ఉంటే.. ఇది ఆయ‌న‌కు సాధ్యంకాదు.

3) త‌న మ‌ద్ద‌తు దారులు రూలింగ్ పార్టీలో ఉంటే.. ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా తానే శాసించ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న కూడా స్టాలిన్‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది.

4) విజ‌య్ ప్ర‌భుత్వ మైనారిటీతో ముందుకు సాగ‌డం వ‌ల్ల అనుక్ష‌ణం.. ప్ర‌ష‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే ప‌రిస్థితి ఉంటుంది. త‌ద్వారా త‌మ పార్టీని డెవ‌ల‌ప్ చేసుకునే ఛాన్స్ కూడా విజ‌య్‌కు ద‌క్కుతుంది.

5) అన్నింటికీ మించి.. త‌న శ‌త్రు ప‌క్షం అన్నాడీఎంకేను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అవ‌కాశం ల‌భిస్తుంది.

6) బీజేపీ ఎదుగుద‌ల‌కు అవ‌కాశం లేకుండా పోతుంది. ఇలా.. ప‌లు కార‌ణాల‌తోనే స్టాలిన్ విజ‌య్‌కు ప‌రోక్షంగా స‌హ‌క‌రిస్తున్నార‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా.

This post was last modified on May 9, 2026 5:42 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

1 hour ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

4 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

4 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

6 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

8 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

9 hours ago