Movie News

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. వారి సినిమాల్లో కొన్ని బాగా ఆడాయి కూడా. తెలుగులో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్లు నటన వైపు అడుగులేసిన దాఖలాలు దాదాపు కనిపించవు. చిన్న చిన్న క్యామియోలు చేయడం తప్పితే సంగీత దర్శకులు పూర్తి స్థాయి హీరోలైన ఉదంతాలు లేవు.

ఐతే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమయ్యాడు. దేవి తెరంగేట్రం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నప్పటకీ.. గత ఏడాదే తన తొలి సినిమా ఖరారైంది. ముందుగా నాని చేస్తాడనుకున్న ‘యల్లమ్మ’ సినిమా… ఆ తర్వాత నితిన్ దగ్గరికి వెళ్లి.. చివరగా దేవిశ్రీ చేతికి చేరింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. గతంలో అన్నట్లే హీరోగా దేవి తొలి చిత్రాన్ని దిల్ రాజే నిర్మిస్తున్నారు.

‘బలగం’ ఫేమ్ వేణు తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా చిత్రీకరణ ఈ మధ్యే మొదలైంది. నటుడిగా తొలి సినిమాను దేవి అంత తేలిగ్గా ఏమీ తీసుకోవట్లేదు. ఇందుకోసం స్పెషల్ లుక్‌లోకి మారాడు. అంతే కాక తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని కూడా కొంత కాలం అతను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ‘యల్లమ్మ’కు దేవినే సంగీత దర్శకుడు కానీ.. ఈ సినిమా చేసే సమయంలో సంగీత దర్శకుడిగా వేరే సినిమాలేవీ ఒప్పుకోకూడదని దేవి నిర్ణయించుకున్నాడట.

అందుకే అతను ఏవైనా ప్రపోజల్స్ వచ్చినా తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. దేవి మనసు తెలుసుకుని ఇప్పుడు ఎవరూ అతణ్ని సంప్రదించడం కూడా చేయట్లేదట. నిజానికి దేవిశ్రీ సంగీత ప్రయాణానికి ఇబ్బంది రాకుండా నెలలో 20 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరపాలని, మిగతా పది రోజులు సంగీతం కోసం వదిలేయాలని టీం నిర్ణయించుకుంది. కానీ దేవి మాత్రం కొన్ని నెలల పాటు సంగీతాన్ని పక్కన పెట్టి మరీ ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు తన ఫోకస్ మొత్తం నటన మీదే ఉందట. కొన్ని నెలలు సంగీతానికి బ్రేక్ ఇచ్చి ఈ చిత్రం మీదే దృష్టిపెట్టనున్న దేవి.. ఆ తర్వాత ‘యల్లమ్మ’ మ్యూజిక్ పనులు చూసుకుంటాడట. ఈ సినిమా పని మొత్తం పూర్తయ్యాకే సంగీత దర్శకుడిగా కొత్త ప్రాజెక్టును అంగీకరిస్తాడని.. ఆలోపు వేరే ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూసే అవకాశాలు లేవని సమాచారం.

This post was last modified on May 8, 2026 5:13 pm

Share

Recent Posts

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

10 minutes ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

15 minutes ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

4 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

4 hours ago