Movie News

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేదు. దర్శకుడు వేణు యెల్దండి అన్నీ రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నప్పటికీ అసలైన హీరోయిన్ సమస్య టీమ్ ని వేధిస్తోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ని కలిస్తే సానుకూలంగా స్పందించిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది కానీ అదెంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే దాకా చెప్పలేం. రాజుగారి బ్యానర్ లోనే మృణాల్ ది ఫ్యామిలీ స్టార్ లో నటించింది.

ఈ ప్రాజెక్టుని దిల్ రాజు ముందు నుంచి ప్రెస్టీజియస్ గా ఫీలవుతున్నారు. అందుకే వేణు అడిగిన భారీ బడ్జెట్ కు ఓకే అన్నారు. ముందు నానికి వినిపించారు. తర్వాత నితిన్ తో ఆల్మోస్ట్ అయ్యిందనుకున్న స్టేజిలో వెనుకడుగు వేశారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ని సెట్ చేసుకున్నారు. ఇదంతా జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా కొబ్బరికాయ కొట్టకపోవడం పట్ల ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దేవి తరచుగా చెన్నై నుంచి హైదరాబాద్ ట్రిప్పులు కొడుతూనే ఉన్నారట.

గతంలో వివి వినాయక్ ని హీరోగా పరిచయం చేసే ఉద్దేశంతో శీనయ్య అనే సినిమా ప్రకటించారు దిల్ రాజు. అది పోస్టర్ రిలీజ్ చేశాక ఆగిపోయింది. ఇప్పుడు ఎల్లమ్మకు అలా జరగకూడదనే సంకల్పంతో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేశారు. ఒకవేళ నోటెడ్ హీరోయిన్ సెట్ కాకపోతే కొత్త అమ్మాయిని తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. అయితే ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కావడంతో ఆ రిస్క్ అంత సులభంగా తీసుకోలేరు.

చాలా ఆలస్యంగా హీరో అవతారం ఎత్తిన దేవిశ్రీ ప్రసాద్ ఇంకోవైపు సినిమాలకు సంగీతం అందించే బాధ్యతను కొనసాగిస్తున్నాడు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో రూపొందుతున్న సున్ – గీతం వచ్చే నెల రెండో వరంలో విడుదల కానుంది. దాని వర్క్స్ చాలా ఉన్నాయి. పైగా పన్నెండు పాటల ఆల్బమ్. సో ఎల్లమ్మకు మరింత గ్యాప్ రావొచ్చు. ఎవరిని ఫైనల్ చేసినా అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటే జనం నోళ్ళలో సినిమా పేరు నానుతూ ఉంటుంది.

This post was last modified on May 8, 2026 6:39 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

35 minutes ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

7 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

7 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

9 hours ago