Political News

పశ్చిమ బెంగాల్ బీజేపీ తొలి సీఎం ఇతనే

పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన మమతా బెనర్జీ తాజాగా బీజేపీ దెబ్బకు కుదేలయ్యారు. దీదీ ఇలాకలో పాగా వేసేందుకు పదేళ్ళుగా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టకేలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

అయితే బెంగాల్ కు బిజెపి నుంచి కాబోయే తొలి ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంపై మాత్రం సందిగ్ధత ఏర్పడింది. ఒకప్పుడు దీదీ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న సువేందు అధికారి
ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్నారు. అయితే ఆయనకు పోటీగా మరో ఇద్దరు నేతలు కూడా ఉండటంతో బిజెపి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది.

ఆ సందిగ్ధతకు తెరదించుతూ తాజాగా సువేందు అధికారి బెంగాల్ లో బిజెపి తరఫున తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అమిత్ షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. రేపు బెంగాల్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

This post was last modified on May 9, 2026 8:50 am

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

1 hour ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago