పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చిందంటే అందులో వివాదాస్పద, వైరల్ ప్రశ్నలు లేకుండా ఉండవు. ముఖ్యంగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఏ ప్రశ్న వేసినా.. దానికి రేణు ఇచ్చే సమాధానం ఆటోమేటిగ్గా వైరల్ అయిపోతుంటుంది. గతంలో పవన్‌ను ఇరుకున పెట్టేలా, ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించేలా రేణు మాట్లాడిన కొన్ని మాటలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే.
కానీ ఈ మధ్య రేణు ఇంటర్వ్యూల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. వివాదాస్పద ప్రశ్నలను అవాయిడ్ చేస్తోంది. ఆ ప్రశ్నలకు జవాబివ్వడం ద్వారా మీడియాకు కంటెంట్ ఇవ్వడం, తాను అన్‌పాపులర్ అవ్వడం మినహా ప్రయోజనం లేదని ఆమె అర్థం చేసుకున్నట్లుంది. అందుకే లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆమె జాగ్రత్త పడింది.
తమిళనాట కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్‌కి సంబంధించి వ్యక్తిగత విషయాలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడడం, అదే సమయంలో త్రిషతో సహజీవనం చేస్తుండడం గురించి పెద్ద చర్చే జరిగింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తుల అక్రమ సంబంధాల గురించి యాంకర్ ప్రశ్న వేశారు. మీరు కంఫర్టబుల్ అయితేనే ఈ ప్రశ్నకు జవాబివ్వండి అని యాంకర్ పేర్కొనగా.. రేణు వామ్మో అనుకుంటూ తల పక్కకు తిప్పుకుంది.
ఇలాంటి ప్రశ్నలు వేసినపుడు తాను గట్టిగా ఊపిరి పీల్చుకున్నా సరే.. ఆ వీడియోను వైరల్ చేస్తారని ఆమె అంది. వీటి గురించి మాట్లాడడం పూర్తిగా అనవసరమని ఆమె చెప్పింది. తాను చెప్పకపోయినా కొందరికి నిజాలు తెలుసని.. తెలియని వాళ్లకు చెప్పినా అర్థం కాదని ఆమె అంది. అలాంటపుడు తాను వాటి గురించి మాట్లాడడం వ్యర్థం అని చెప్పింది.
తాను ఇలాంటి విషయాల్లో ఏం మాట్లాడినా.. దాని వరకు వీడియో కట్ చేసి దాని మీద వ్యాఖ్యానాలు చేసి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లు వైరల్ చేసుకుని డబ్బులు సంపాదిస్తారని.. వాళ్లకు తాను ఎందుకు ఫీడ్ ఇవ్వాలని రేణు ప్రశ్నించింది. తనకు వయసు మళ్లిన తర్వాత ఏమైనా ఇలాంటి ప్రశ్నలకు జవాబిస్తానేమో కానీ.. ఇప్పుడు మాత్రం ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె స్పష్టం చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates