కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు సగటు మూవీ లవర్స్ కు కూడా స్పెషల్ మెమరీ అవుతుంది. వాళ్లకు ఫహద్ ఫాసిల్, నయనతార లాంటి పవర్ హౌసెస్ తోడైతే ఇక చెప్పేదేముంది. మే 1 విడుదల కాబోతున్న ‘పాట్రియాట్’ దాన్ని సాధ్యం చేయబోతోంది. సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇద్దరూ ఫుల్ లెన్త్ రోల్స్ లో తెరను పంచుకోబోతున్నారు. అయితే అసలు మ్యాటర్ ఇది కాదు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాట్రియాట్ కు ఇతర భాషల్లో బజ్ లేదు. ప్యాన్ ఇండియా లాంగ్వేజెస్ లో అనువదిస్తున్నారు కానీ అవసరమైన అంచనాలు పెంచడంలో టీమ్ సక్సెస్ కాలేకపోతోంది. ఇటీవలే హాట్ స్టార్ కోసం మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరూ టీమ్ తో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. దాని క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. కానీ సగటు ఆడియన్స్ కి మాత్రం అవి రీచ్ కావడం లేదు. దృశ్యం 3 మీద ఉన్న ఆసక్తి పాట్రియాట్ మీద లేదన్నది వాస్తవం.
టాలీవుడ్ బాక్సాఫీస్ వరకు చూసుకుంటే మే 1 కమెడియన్ సత్య జెట్లీ, తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం రిలీజ్ అవుతున్నాయి. వెరైటీ పబ్లిసిటీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పాట్రియాట్ వల్ల వీటికి వచ్చిన చిక్కేమి లేదు. ఈ మధ్య మన జనాలు తమిళ మలయాళ సరుకు మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు. కోలీవుడ్ లో వసూళ్లు రాబట్టిన యూత్ మన దగ్గర ఫ్లాప్ అయితే మల్లువుడ్ సెన్సేషన్ వాలా 2 ఇక్కడ వీక్ ఓపెనింగ్ తో మొదలయ్యింది.
స్ట్రెయిట్ అయినా డబ్బింగ్ అయినా క్వాలిటీ కంటెంట్ కోసం జనాలు మొహం వాచిపోయి ఉన్నారు. అది ఇస్తే చాలు థియేటర్లను నింపడానికి రెడీ అంటున్నారు. ఆ కరువు వల్లే కొత్త రిలీజులు వదిలి డార్లింగ్ కి భారీ కలెక్షన్లు ఇచ్చేశారు. వేసవి ఇలా వృధా కావడం పట్ల బయ్యర్ వర్గాలు కలత చెందుతున్నాయి. పెద్ది రాకపోయింది సరే కానీ ఇతర టయర్ 2 హీరోల సినిమాలు సైతం రకరకాల కారణాలతో వేసవిని వదులుకోవడం థియేటర్లను తీవ్రంగా ప్రభావితం చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates