రజనీ షారుఖ్.. రీవేంజ్ కాదు కానీ…

సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ లాంటి దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారంటే ఆ అంచనాలే వేరుగా ఉంటాయి. అయితే గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య క్యామియో రోల్స్, గెస్ట్ రోల్స్ విషయంలో ఒక వింతైన కోఇన్సిడెన్స్ మూమెంట్స్ చోటుచేసుకుంటున్నాయని ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అఫీషియల్ గా కన్ఫర్మ్ కాకపోయినా, ఈ ఇన్‌సైడ్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అసలు విషయం ఏంటంటే, దాదాపు దశాబ్దం క్రితం షారుఖ్ ఖాన్ ‘రా.వన్’ సినిమా చేస్తున్నప్పుడు రజనీకాంత్ అందులో ‘చిట్టి’ రోబోగా కనిపిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. స్వయంగా షారుఖ్ ఈ విషయాన్ని ప్రకటించడమే కాకుండా, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కోసం సెట్ కూడా వేశారట. కానీ చివరి నిమిషంలో ఏమైందో ఏమో కానీ రజనీ ఆ సినిమాలో కనిపించలేదు. చివరకు ఒక డూప్ తో ఆ సీన్ మేనేజ్ చేయాల్సి వచ్చింది. అప్పట్లో రజనీకాంత్ అనారోగ్య కారణాల వల్ల ఆ క్యామియో చేయలేకపోయారని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు సరిగ్గా అలాంటి సీనే మళ్ళీ రిపీట్ అవుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీ చేస్తున్న ‘జైలర్ 2’లో షారుఖ్ ఖాన్ ఒక పవర్ ఫుల్ గెస్ట్ రోల్ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. పీఆర్ టీమ్స్ కూడా ఈ వార్తకు గట్టిగానే హైప్ ఇచ్చాయి. కానీ షూటింగ్ మొదలయ్యే సమయానికి షారుఖ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘రా.వన్’ టైంలో రజనీ చేయలేకపోయిన గెస్ట్ రోల్ కు.. ఇప్పుడు షారుఖ్ ‘జైలర్ 2’లో నో చెప్పడం ద్వారా హిస్టరీ రిపీట్ అయ్యిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

నిజానికి ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో కనిపించాలంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వడం చాలా ముఖ్యం. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన సొంత సినిమాలు ‘కింగ్’, ‘పఠాన్ 2’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందుకే డేట్స్ కుదరక ఆయన ఈ క్యామియో వదులుకుని ఉండవచ్చు.

అంతే తప్ప దీని వెనుక ఎలాంటి పంతాలు, పట్టింపులు లేవని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పైగా గతంలో చెన్నై ఎక్స్ ప్రెస్ లోనే రజినీకాంత్ ఫేమ్ తో లుంగీ డ్యాన్స్ అంటూ షారుక్ ప్రమోషన్ గా వాడుకున్నాడు. ఇద్దరు స్టార్ల మధ్య వ్యక్తిగతంగా చాలా మంచి అనుబంధం ఉంది. కేవలం ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ వల్లే ఈ కలయిక సాధ్యపడలేదని అర్థమవుతోంది.