యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాను నటించకుండా నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. సుమారు నలభైకి పైగా కొత్తవాళ్లను పరిచయం చేస్తూ డెబ్యూ డైరెక్టర్ మునిరాజ్ కు అవకాశం ఇవ్వడమే కాదు ప్రమోషన్స్ పరంగా ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువే చేసింది టీమ్. ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, థియేటర్ విజిట్లు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాంతాడంత ఉంది. మరీ ఆహా ఓహో అనే టాక్ రాలేదు కానీ డీసెంట్ ముద్ర అయితే తిమ్మరాజుపల్లి వేయించుకుంది.
నిర్మాత కిరణ్ ఎంత వరకు సక్సెస్ అయ్యాడనే దానికి రెండు కోణాలు ఉన్నాయి. మొదటిది పెట్టుబడి. సినిమాకైనా ఖర్చు, ఓటిటి డీల్స్, థియేటర్ బిజినెస్ పరంగా చూసుకుంటే తనకు ఆల్రెడీ లాభాలు వచ్చాయని ఇన్ సైడ్ టాక్. అలా కాకుండా కమర్షియల్ స్కేల్, ఆడియన్స్ రెస్పాన్స్ పరంగా చూసుకుంటే మరీ గొప్ప స్థాయిలో ఆడే సూచనలు తక్కువగానే ఉన్నాయి. పాయింట్ బాగున్నప్పటికీ ఓవరాల్ కంటెంట్ ని సూపర్ అనిపించేలా చేయడంలో దర్శకుడు తడబడిన మాట వాస్తవం.
లిటిల్ హార్ట్స్ లాగా ఇదేదో అదిరిపోయే వసూళ్లు తెచ్చే ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చేసింది. ఎంతసేపూ నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చామని పదే పదే చెప్పుకున్న కిరణ్ బృందం ఏదో మిస్సయ్యింది కాబట్టే యునానిమస్ గా మద్దతు రాలేదనే వాస్తవాన్ని గుర్తించాలి. సినిమా మీద కంప్లయింట్స్ పెద్దగా లేకపోయినా ప్రెజెంటేషన్ అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్లే బాక్సాఫీస్ రన్ నెమ్మదిగా ఉంది. పోటీలో ఉన్న పాపం ప్రతాప్, బ్యాడ్ బాయ్ కార్తీక్ కన్నా బెటర్ గా ఉందనే నిజాన్ని ఒప్పుకోవాలి.
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో రిస్క్ లేని బడ్జెట్ లు పెట్టుకుని కిరణ్ లాంటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని చేయాలి. కొత్త టాలెంట్లు పరిచయమవుతాయి. సపోర్టింగ్ క్యాస్ట్, సంగీత దర్శకుల కొరత అసలే టాలీవుడ్ లో విపరీతంగా ఉంది. తిమ్మరాజుపల్లి టీవీ లాంటి సినిమాలు ఇతర నిర్మాతలకు కూడా ఉపయోగపడతాయి. ఇకపై ఇదే తరహాలో న్యూ టాలెంట్ కోసమే సినిమాలు తీస్తానని ప్రకటించిన కిరణ్ అబ్బవరం అన్నంత పని చేస్తే పరిశ్రమకు మంచిదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates