మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని, ఏడాది పాటు వెయిట్ చేయించే టాలీవుడ్ సినిమాలు తనకు నప్పవని చెప్పి పెద్ద బాంబు పేల్చాడు. టొవినో కొత్త మూవీ పళ్ళి చట్టంబి తాజాగా విడుదలయ్యింది. టైటిల్ మార్చకుండా ఎందుకు పెట్టారని అడిగితే బాహుబలి అప్పుడు ఇలాంటివి మేం అడగకుండా ఆదరించాం కదా, కంటెంట్ కు భాష ఉండదని విచిత్ర అర్థం ఒకటి చెప్పాడు.
కట్ చేస్తే పళ్ళి చట్టంబి థియేటర్లలో అడుగు పెట్టింది. ఇది పూర్తిగా కేరళ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా. 1960 ప్రాంతంలో ఆ రాష్ట్రాన్ని కుదిపేసిన భూ సంస్కరణల చట్టం వచ్చినప్పుడు జరిగిన పరిణామాలు, రాజకీయ ఘట్టాలు, దారుణాలు ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. నేటివిటీ మొత్తం అక్కడిదే కావడంతో మనకు కనెక్టయ్యే అవకాశాలు తగ్గిపోయాయి. దర్శకుడు జొస్ ఆంటోనీ తన టేకింగ్ లో గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకోలేదు. మల్లువుడ్ ఆడియన్స్ నే టార్గెట్ చేసుకున్నాడు.
దీంతో పళ్ళి చట్టంబి ఏపీ తెలంగాణలో వర్కౌట్ అయ్యే సూచనలు తక్కువగా ఉన్నాయి. అయినా ఓటిటిలో డబ్బింగ్ చేసిన మలయాళ సినిమాలు ఆదరణ పొందినంత మాత్రాన అవన్నీ ఇక్కడ థియేటర్లలో ఆడుతాయనే గ్యారెంటీ లేదు. అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ వాటి హక్కులు కొనేటప్పుడు డబ్బింగ్ వెర్షన్లకు థియేటర్ రిలీజ్ డిమాండ్ చేయదు. నిర్మాతలు కూడా ప్రాక్టికల్ గా అలోచించి పబ్లిసిటీ ఖర్చులు కూడా రావని గురించి ఆ ఆలోచన మనుకుంటారు.
పళ్ళి చట్టంబిలో హీరోయిన్ కయదు లోహర్ కావడం ఒక వర్గం ప్రేక్షకులను కాస్త దీని మీద లుక్ వేసేలా చేసింది. కానీ కంటెంట్ మనకు నప్పేది కాకపోవడంతో ఇక్కడ వసూళ్లు రావడం కష్టం. బాక్సాఫీస్ వద్ద మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు పోటీలో ఉండటం కూడా పళ్ళి చట్టంబికి ఇబ్బందిగా మారింది. అయినా ప్యాన్ ఇండియా పేరుతో ఇలా ప్రతి సినిమాని అనువదిస్తూ పోతే రిజల్ట్స్ రావు. టైటిల్ విషయంలో బాహుబలి పోలిక చెప్పిన టొవినో ఇప్పుడీ రెస్పాన్స్ చూసి ఏమంటాడో.
Gulte Telugu Telugu Political and Movie News Updates