Movie News

ఫ్రెష్షుగా టార్గెట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్

స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా జమానాలో దర్శకులు అన్నింటికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మొన్న జనవరిలో రాజా సాబ్ ఫలితం తేలిపోయాక మారుతీ వారాల తరబడి బయట కనిపించలేదు. మూడు నెలలు దాటిపోయినా కొత్త ప్రాజెక్టు లాక్ కాలేదు. స్క్రిప్ట్ రాసుకున్నారు కానీ కాంబోలు గట్రా ఇంకా సెట్టవ్వాలి. ఇదంతా ఫ్లాప్ మహత్యమే తప్ప మరొకటి కాదు.

థియేటర్ నుంచి రాజా సాబ్ ఓటిటిలో వచ్చాక హెచ్డి క్లిప్స్ తీసుకొచ్చి మరీ ట్రోలింగ్ చేసారు అభిమానులు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వంతు వచ్చింది. నెల రోజుల కన్నా ముందే డిజిటల్ లో వచ్చిన పవన్ కొత్త మూవీ అప్పుడే టార్గెట్ అయిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వం, రైటింగ్ ని విమర్శిస్తూ గట్టిగానే తలంటుతున్నారు. శ్రీలీల సీన్లు, హీరోయిజంని అతిగా ఎలివేట్ చేయడం లాంటివి పాయింటవుట్ చేసి మరీ ప్రూఫ్స్ పెడుతున్నారు. ఇది కొన్ని రోజులు కొనసాగనుంది.

అలాని అందరూ నెగటివ్ అని కాదు కానీ కొందరు పాజిటివ్ గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. హరిహర వీరమల్లు కన్నా బెటరనే బ్యాచ్ భేషుగ్గా ఉంది. అయితే హరీష్ శంకర్ మాత్రం దేనికీ స్పందించడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో రన్ అవుతున్నప్పుడు నిర్మాణ సంస్థ సైలెంట్ అయిపోయినా సరే తను మాత్రం ఎక్స్ లో కనిపించే ప్రతి పాజిటివ్ ట్వీట్ అదే పనిగా రీ కోట్ చేసి ఆనందాన్ని వ్యక్తపరిచేవారు. ఈ ప్రమోషన్ వారం పైనే జరిగింది.

కానీ ఇప్పుడు మాత్రం హరీష్ శంకర్ రెస్పాండ్ అవ్వడం లేదు. వెంటనే స్పందిస్తే యాంటీ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ చేస్తారని భావించారు కాబోలు సైలెంట్ గానే ఉంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఇప్పుడప్పుడే స్క్రీన్ మీద కనిపించబోవడం లేదు. సురేందర్ రెడ్డి సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కొత్త కమిట్ మెంట్స్ జరగలేదు. ఏడాది గ్యాప్ లోనే మూడు సినిమాలు ఇచ్చిన పవర్ స్టార్ పూర్తిగా పొలిటికల్ మూడ్ లోకి వెళ్లిపోయారు. మళ్ళీ ఎప్పుడు వస్తారో.

This post was last modified on April 16, 2026 9:39 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago