Movie News

అలాంటి మ్యాజిక్.. ఇంకోసారి సాధ్యమేనా?

గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆద్యంతం మంచి ఫీల్‌తో సాగే సినిమాలో కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులను కదిలించేస్తాయి. ప్రేమకథా చిత్రాల రూపురేఖలే మారిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి ప్యూర్ లవ్ స్టోరీ తీయడం అరుదు అంటే.. అది ప్రేక్షకులకు అంతగా నచ్చి బ్లాక్ బస్టర్ కావడం మరింత విశేషం. 

గతంలో ‘ఆషిఖి-2’ లాంటి మరుపరాని చిత్రాన్ని అందించిన మోహిత్ సూరినే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. కొత్త హీరో హీరోయిన్లు అహాన్ పాండే, అనీత్ పడ్డా.. తమ పాత్రలకు అందులో ప్రాణం పోశారు. కొత్త జంట కావడం వల్ల ప్రేక్షకులకు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించగా.. పెర్ఫామెన్స్ విషయంలో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. అందుకే ‘సైయారా’ ఒక క్లాసిక్‌గా నిలిచింది. 

ఐతే ఇప్పుడు ‘సైయారా’ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా మోహిత్ సూరినే ఇంకో సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ ‘సైయారా’ లాంటి మ్యాజిక్స్ ఎప్పుడో కానీ జరగవు. ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలనుకోవడం సాహసమే. ప్రేక్షకులు భారీ అంచనాలతో చూస్తారు. ప్రతిదీ ముందు వచ్చిన సినిమాతో పోల్చుకుని చూస్తారు. ఏమాత్రం అంచనాలకు తగ్గట్లు లేకపోయినా ఉస్సూరుమంటారు.

కాబట్టి ఇంత త్వరగా ‘సైయారా’ కాంబినేషన్ రిపీట్ చేయాలనుకోవడం చాలా రిస్కీనే. కాంబినేషన్ క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ రావచ్చు కానీ.. సినిమా తాము ఆశించినట్లుగా లేకపోతే ఫలితం తేడా కొట్టేస్తుంది. మరి ‘సైయారా’ కాంబోను క్యాష్ చేసుకుందామని సినిమా తీస్తున్నారా.. లేక నిజంగా ‘సైయారా’ మ్యాజిక్‌ను రిపీట్ చేయగలిగే స్థాయి కంటెంట్ వీళ్ల దగ్గర ఉందా అన్నది చూడాలి. త్వరలో చిత్రీకరణకు వెళ్లనున్న చిత్ర బృందం వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటోంది.

This post was last modified on April 16, 2026 9:04 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago