ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా, అభిమానుల పేరు చెప్పి గిరి గీసుకోకుండా.. తాను చేసే పాత్రల విషయంలో చాలా లిబరల్‌గా ఉంటాడు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్. హీరోయిజం లేని ఫ్యామిలీ టచ్ ఉన్న, కామెడీ పాత్రలు చేయడమే కాదు.. ఇంకో హీరోతో కలిసి మల్టీస్టారర్లో నటించడానికి, వేరే చిత్రాల్లో అతిథి పాత్రలు చేయడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడడు.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’లో ఆయన క్యామియోతో మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకీ.. తమిళ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ చిత్రంలో స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస ఫ్లాపుల నుంచి బయటపడుతూ గత ఏడాది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో పెద్ద హిట్టు కొట్టాడు అజిత్. ఆ చిత్రాన్ని రూపొందించిన ఆధిక్ రవిచంద్రన్‌తోనే మళ్లీ ‘డేర్ డెవిల్’ అనే సినిమా చేయబోతున్నాడతను.
ఈ సినిమాలో వెంకీతో ప్రత్యేక పాత్ర చేయించబోతున్నాడట అధిక్ రవిచంద్రన్. వెంకీని సంప్రదించడం, ఆయనకు పాత్ర, పారితోషకం నచ్చి ఓకే చేయడం జరిగిపోయాయట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతోందట. అజిత్‌కు తెలుగులో ఓ మాదిరి ఫాలోయింగ్ ఉంది. కానీ ఇక్కడ ఎప్పుడూ పెద్ద విజయాన్నందుకోలేదు. వెంకీ ప్రత్యేక పాత్ర చేశాడంటే ‘డేర్ డెవిల్’కు తెలుగులోనూ మంచి క్రేజ్ రావడం ఖాయం.
ఈ చిత్రాన్నిఅజిత్ సొంత బేనర్లో తెరకెక్కుతుండడం విశేషం. అజిత్ భార్య షాలిని ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. తాను కోరుకున్న పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు రాని నేపథ్యంలో అజిత్ తన రెమ్యూనరేషన్‌నే పెట్టుబడిగా పెట్టి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నాడు. ఇంకా కథానాయిక ఎవరన్నది ఖరారవ్వలేదు. వెంకీ ఇంతకుముందు తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘ఈనాడు’ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేశారు.
This post was last modified on August 11, 2026 10:05 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…