మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సంబంధించి ప్రతి ప్రోమో ఆకట్టుకుంది. చివరగా ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఈ చిత్రంలో చరణ్ క్రికెటర్‌గా మాత్రమే కనిపించబోతున్నాడని అనుకుంటూ ఉంటే.. ఒక్కసారిగా కుస్తీ యోధుడి అవతారం ఎత్తి పెద్ద షాకిచ్చాడు.
కుస్తీ యోధుడు అంటే కొన్ని రోజులు జిమ్‌లో కష్టపడి కాస్త కండలు పెంచి కనిపించడం కాదు. నెలల తరబడి శ్రమించి, నిజమైన రెజ్లర్ ఎలా ఉంటాడో అలాగే తయారయ్యాడు చరణ్. ఇంకా చెప్పాలంటే రియల్ రెజ్లర్లను మించిన బాడీతో కనిపించాడు అన్నా కూడా అతిశయోక్తి కాదు.
ఐతే ఇందుకోసం జాతీయ స్థాయి రెజ్లింగ్ కోచ్‌ను పెట్టుకున్నాడట చరణ్.
ఆ కోచ్.. బాలీవుడ్లో రెజ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సుల్తాన్, దంగల్ చిత్రాలకు కూడా పని చేశాడట. రెజ్లర్ పాత్రకు సంబంధించిన మేకోవర్ కోసం ఆ కోచ్‌తో కలిసి ఐదు నెలల పాటు కష్టపడినట్లు చరణ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ కోచ్ తనను బాగానే కష్టపెట్టాడని.. ఒక దశలో ఆ కష్టం తట్టుకోలేక ‘‘సర్‌జీ నేనేమీ రెజ్లింగ్ నేషనల్స్ కోసం వెళ్లట్లేదు’’ అని అన్నట్లు చరణ్ తెలిపాడు.
ఐతే అంత శ్రమించడం మంచి ఫలితాన్నే ఇచ్చిందని, సినిమాలో ఈ ఎపిసోడ్ స్పెషల్‌గా ఉంటుందని చరణ్ అన్నాడు. ఇక తన కుటుంబం, పిల్లల గురించి కూడా చరణ్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
తాను ముగ్గురు పిల్లల తండ్రిని అని, వారి విషయంలో బాధ్యతతో వ్యవహరిస్తానని చరణ్ వ్యాఖ్యానించాడు. తన పిల్లలు రిచ్ కిడ్స్‌గా పెరగాలని అనుకోవట్లేదని.. వారికి కష్టం విలువ తెలియాలని.. అందుకోసం వారితో నేను కఠినమైన తండ్రిగానే వ్యవహరిస్తానని చరణ్ స్పష్టం చేశాడు. తన పిల్లలు ధైర్యంతో, సాహసవంతులుగా పెరగాలని కోరుకుంటున్నట్లు చరణ్ తెలిపాడు. తన ప్రపంచం కుటుంబం, పెంపుడు జంతువులే అని చరణ్ పేర్కొన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
