Movie News

ఏప్రిల్ & మే… కొత్త సినిమాలతో బాక్సాఫీస్ రష్

ఇంకో 22 రోజులు ఉండగానే మే నెల బాక్సాఫీస్ క్యాలికులేషన్లు మొదలైపోయాయి. ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని తెలిశాక అందరూ ఎవరి ప్లాన్లలో వాళ్ళు కొత్త స్ట్రాటిజిలు వేసుకుంటున్నారు. చాలా ముందస్తు ఆలోచనతో మే 1 లాక్ చేసుకున్న ‘గాయపడ్డ సింహం’ దీని వల్ల పెద్ద ప్రయోజనం పొందనుంది. తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందిన ఈ కామెడీ యాక్షన్ డ్రామా మీద మెల్లగా అంచనాలు పెరిగేలా టీమ్ చేస్తున్న ప్రమోషన్లు మంచి ఫలితాన్ని ఇచ్చేలా ఉన్నాయి.

కమెడియన్ సత్య హీరోగా రూపొందిన ‘జెట్లీ’ని మే 8 రంగంలోకి దించబోతున్నారు. మత్తువదలరా, మత్తువదలరా 2 ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడంతో మంచి రిలీజ్ దక్కనుంది. ఇది కనక హిట్ అయితే సత్య ఇమేజ్ అమాంతం పెరుగుతుందని రషెస్ చూసినవాళ్లు అంటున్నారు. కొంచెం ముందే రావడానికి ట్రై చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’ ముందు ఫిక్స్ చేసుకున్న మే 15కే కట్టుబడాల్సి వస్తోంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే డబ్బింగ్ సినిమాల తాకిడి కూడా బాగానే ఉండబోతోంది. మమ్ముట్టి – మోహన్ లాల్ మల్టీస్టారర్ ‘పాట్రియాట్’ మే 1 రానుంది. సాయిపల్లవి హిందీ డెబ్యూ ‘ఏక్ దిన్’ తెలుగు వెర్షన్ తో పాటుగా అదే డేట్ కి రిలీజ్ చేస్తున్నారు. రితేష్ దేశముఖ్ నటించిన ‘రాజా శివాజీ’ సైతం సేమ్ డే రేసులో ఉంది. ట్రైలర్ వచ్చాక దీని మీద అంచనాలు పెరిగాయి. ధనుష్ ‘కార’తో పాటు ధ్రువ సర్జ ‘కెడి డెవిల్’ ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 30 థియేటర్లలో అడుగు పెట్టేందుకు అవుతున్నాయి.

ఇవన్నీ కాసేపు పక్కనపెడితే ఎల్లుండి వచ్చే డెకాయిట్ మినహాయిస్తే నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా మీడియం బడ్జెట్ లో రూపొందిన కంటెంట్లే. ఏప్రిల్ 17 నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్, కిరణ్ అబ్బవరం నిర్మించిన తిమ్మరాజుపల్లి టీవీ, తిరువీర్ పాపం ప్రతాప్ తో పాటు తెరచాప అనే మరో చిన్న మూవీ ఉన్నాయి. ఆ పైవారం స్లాట్ ఖాళీగా ఉండనుంది. సో టాలీవుడ్ వరకు చూసుకుంటే రాబోయే యాభై రోజులు టయర్ 1 స్టార్ సినిమాలు లేకపోయినా కొత్త కంటెంట్లు ఆడియన్స్ ని పలకరించబోతున్నాయి.

This post was last modified on April 8, 2026 10:44 am

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

3 minutes ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

1 hour ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

1 hour ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

2 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

4 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

5 hours ago