Movie News

ఐకాన్ స్టార్… విజేత నుంచి విశ్వవిజేత దాకా

స్టార్ లెగసి ఉన్న బ్యాక్ గ్రౌండ్ నుంచి హీరోలు రావడం కొత్త కాదు. అన్ని భాషల్లో జరిగేదే. కానీ లెజెండరీ హాస్య నటుడి మనవడిగా, అగ్ర నిర్మాత వారసుడిగా, మెగాస్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఆ అంచనాల భారం మోయడం అంత సులభం కాదు. 2003 గంగోత్రి రిలీజైనప్పుడు అల్లు అర్జున్ లుక్, యాక్టింగ్ మీద జనంలో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. కథలో ఎమోషన్స్, కీరవాణి పాటలు, రాఘవేంద్రరావు మేజిక్ వల్ల హిట్టయ్యింది కానీ తనను తాను బన్నీ సెల్ఫ్ రివ్యూ చేసుకోవడానికి చాలా ఉపయోగపడింది.

అదే సమయంలో డిఫరెంట్ యూత్ క్యారెక్టరైజేషన్ తో తనను కలిసిన సుకుమార్ కోసం అల్లు అర్జున్ ఎవరూ ఊహించనంత గొప్పగా మేకోవర్ అయ్యాడు. వన్ సైడ్ లవర్ గా తనలో ఒక కొత్త కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని పడిన కష్టం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఆర్య బ్లాక్ బస్టర్ ఒక్క దెబ్బకు బన్నీ ఇమేజ్, ఫాలోయింగ్ అమాంతం పెంచేసింది. ఆ తర్వాత బన్నీ రూపంలో వినాయక్ మాస ఇమేజ్ ఇప్పించగా హ్యాపీ అనుకున్నంత ఆడకపోయినా తనలో ఎన్ని వేరియేషన్లు ఉన్నాయో ఇతర దర్శకులకు రిఫరెన్స్ లా ఉపయోగపడింది.

పూరి జగన్నాథ్ పరిచయం కొత్త సవాల్ ఇచ్చింది. చాలా కష్టమైన సిక్స్ ప్యాక్ బాడీని తెరకు పరిచయం చేసింది. అదే దేశముదురు. అందులో సన్యాసిని ప్రేమలో పడేసే విచిత్రమైన క్యారెక్టర్ తో అభిమానులకే కాదు జనాలకు కూడా పిచ్చిపిచ్చిగా నచ్చేశాడు. ఫలితంగా ఇంకో సూపర్ డూపర్ హిట్టు. ఆర్య 2, వరుడు ఫెయిలైనా వేదంలో కేబుల్ రాజు పాత్ర బన్నీలోని వర్సటైల్ యాక్టర్ ని బయటికి తీసుకొచ్చింది. వీటికి పూర్తి భిన్నంగా హుషారుని ఒంట్లో కరెంటుగా పెట్టుకుని తిరిగే జులాయిగా అల్లు అర్జున్ ని చూపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో మర్చిపోలేని సూపర్ హిట్టు అల్లు హీరోకి ఇచ్చాడు.

రేసు గుర్రం మరో సంచలనం. సురేందర్ రెడ్డి మార్కు టిపికల్ పాత్ర చిత్రణని అలవోకగా ఒంటబట్టించుకుని లక్కీగా చెలరేగిపోయిన తీరు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. తండ్రి ఆశయం చుట్టూ తిరిగే సన్నాఫ్ సత్యమూర్తిలో విరాజ్, రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్రలు తన స్థాయిని మరింత పైకి తీసుకెళ్లాయి. తనకు నచ్చితే క్యామియో కోసమైనా తెలంగాణ యాస నేర్చుకుని మరీ రుద్రమదేవిలో బన్నీ ఒదిగిపోయిన తీరు నభూతో నభవిష్యత్.

సరైనోడు రూపంలో అల్లు అర్జున్ అందుకున్న మరో బెస్ట్ మైలేజ్ తన మార్కెట్ ని అమాంతం పెంచేసింది. వంద కోట్ల బిజినెస్ ఎలా ఉంటుందో ఇండస్ట్రీకి పరిచయం చేసింది. హరీష్ శంకర్ డీజే దువ్వాడ జగన్నాథం కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. కొత్త దర్శకుడితో రిస్క్ అవుతుందని వారించినా వక్కంతం వంశీకి ఇచ్చిన అవకాశం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.ఫెయిలైనా బన్నీలో నటుడి లెవెల్ ని మరింత పెంచింది.

ఇక అల వైకుంఠపురములో రికార్డుల గురించి చెప్పాల్సి వస్తే పుస్తకమంత అవుతాయి. రక్తపాతం లేకుండా సింపుల్ హీరోయిజంతో వినోదమే ప్రధానంగా తీసిన ఈ త్రివిక్రమ్ మాయాజాలం బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక పుష్పది ఒక చరిత్ర. అడవి దుంగలు స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ గా అల్లు అర్జున్ విశ్వరూపానికి బాక్సాఫీస్ దాసోహమంది. ముంబై నుంచి మచిలీపట్నం దాకా ఎక్కడ చూసినా రికార్డుల హోరే. పుష్ప 2 ఏకంగా పదిహేను వందల కోట్లు దాటడం టాలీవుడ్ ఎప్పడూ చూడని హిస్టరీ. అందుకే ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.

కేవలం ఇరవై ఒక్క సినిమాల ప్రయాణంలో బన్నీ సాధించిన ఘనతలు ఎన్నో. టాలీవుడ్ హీరోలు దశాబ్దాల తరబడి స్వపంగా చూసిన జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని పుష్పతో సాధించాడు. తెలంగాణ ప్రభుత్వం ఇదే సినిమాకు గద్దర్ పురస్కారంతో గౌరవించింది. ఏడు ఫిలిం ఫేర్, మూడు నంది అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. హైదరాబాద్ సినీ ప్రియుల కోసం డాల్బీ సినిమా టెక్నాలజీని మల్టీప్లెక్సు రూపంలో తీసుకురావడం ద్వారా బన్నీ ఇండస్ట్రీ ప్రేమను ఇలా పలు రూపాల్లో చూపిస్తూనే వచ్చాడు.

ఇప్పుడు అట్లీతో చేస్తున్న ఏఏ 22 ఇంటెర్నేషల్ లెవెల్ లో అంచనాలు పెంచుకుంటోంది. ఎప్పుడూ చూడని ఒక విజువల్ వండర్ చూస్తామని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టు ప్రకటన స్టేజి నుంచే అంచనాలు పెంచేసుకుంటోంది. చిరంజీవి విజేతలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించడంతో మొదలుపెట్టి ఇప్పుడు విశ్వవిజేతగా ఎదిగే వరకు అల్లు అర్జున్ చేసిన జర్నీలో ఎన్నో కుదుపులు, మలుపులు. అవన్నీ తట్టుకుని కోట్లాది మందికి ఐకాన్ స్టార్ గా నిలవడం ఎందరికో స్ఫూర్తి.

This post was last modified on April 8, 2026 10:52 am

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

4 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

5 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

5 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

6 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

8 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

9 hours ago