తెలుగులో డ‌బ్బింగ్ చెప్పి, వెన‌క్కి త‌గ్గిన హీరో

ఎప్పుడు ఎవ‌రి కెరీర్ ఎలా మ‌లుపు తిరుగుతుందో చెప్ప‌లేం. త‌మిళ కుర్రాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌కు… నాలుగేళ్ల ముందు వ‌ర‌కు త‌మిళ‌నాడులోనే పెద్ద‌గా పాపులారిటీ లేదు. కానీ ఇప్పుడు అత‌ను మూడు వంద కోట్ల సినిమాలు ఇచ్చిన హీరో. అటు త‌మిళఃలోనే కాక‌.. ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాడు ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ల‌వ్ టుడేతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అత‌ను.. త‌ర్వాత డ్రాగ‌న్, డ్యూడ్ చిత్రాల‌తోనూ విజ‌యాలందుకున్నాడు. 

ఇప్పుడు ఎల్ఐకే చిత్రంతో ఈ నెల 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. తెలుగులో త‌న ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని, డ‌బ్బింగ్ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త ప‌డుతున్నాడు ప్ర‌దీప్. అలాగే ప్ర‌మోష‌న్ల‌కు కూడా గ‌ట్టిగా చేస్తున్నాడు. అంత‌టితో ఆగ‌కుండా ఎల్ఐకేకు త‌నే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోవాల‌ని అనుకున్నాడ‌ట ప్ర‌దీప్. కానీ త‌న వాయిస్ కుద‌ర‌క‌పోవ‌డంతో వెన‌క్కి త‌గ్గిన‌ట్లు వెల్ల‌డించాడు.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఎల్ఐకే టీజ‌ర్లో వినిపించింది త‌న వాయిసే అని వెల్ల‌డించాడు ప్ర‌దీప్. త‌న‌నే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోమ‌ని ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివన్ చెప్ప‌డంతో తాను ఆ ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు ప్ర‌దీప్ తెలిపాడు. కానీ త‌న వాయిస్ విన్న కొంత‌మంది తెలుగు ప్రేక్ష‌కులు.. బాగా ట్రై చేశావు, కానీ ఇంకెప్పుడూ ట్రై చేయ‌కు అని స‌ల‌హా ఇచ్చిన‌ట్లు స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు ప్ర‌దీప్. త‌న డ‌బ్బింగ్ స‌రిగా కుద‌ర‌క‌పోవ‌డంతో ఈసారికి మ‌ళ్లీ వాసు స‌ర్‌తోనే త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పించిన‌ట్లు ప్ర‌దీప్ వెల్లడించాడు. 

ఐతే తాను ఇంత‌టితో ఆగిపోన‌ని.. మ‌ళ్లీ ప్ర‌య‌త్నిస్తాన‌ని.. తెలుగు మీద ప‌ట్టు సాధించి అంద‌రూ మెచ్చేలా భ‌విష్య‌త్తులో త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పుకుంటాన‌ని ధీమా వ్య‌క్తం చేశాడు ప్ర‌దీప్. ఉప్పెన భామ కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టించిన ఎల్ఐకేలో ఎస్.జె.సూర్య విల‌న్ పాత్ర చేశాడు. న‌య‌న‌తార నిర్మాత‌. 20240లో జ‌రిగే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. షూట్ మొద‌లైన రెండేళ్ల త‌ర్వాత ఈ చిత్ర విడుద‌ల‌వుతోంది.