అనుష్కని కాసేపే చూపిస్తే ఎలా

అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు. జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో ప్రభుదేవా, వినీత్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు చాలా ఉన్నారు. మాయాజాలం బ్యాక్ డ్రాప్ లో తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఒక చక్రవర్తి నేపథ్యంతో తీస్తున్నారు. హోమ్ లాంటి తక్కువ బడ్జెట్ తో ఆకట్టుకున్న రోజిన్ థామస్ ఈ కథనార్ ద్వారా సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు.

మూడు నిమిషాల ట్రైలర్ లో అనుష్కని కేవలం రెండు షాట్లకు పరిమితం చేయడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ గా కీలకమైన పాత్ర పోషించినప్పుడు కంటెంట్ లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ అలా చూపించి చూపించకుండా దాచి పెట్టడం ఏమిటని నిలదీస్తున్నారు. అంత లెన్త్ ఉన్నప్పటికీ కథేంటో పూర్తిగా అర్థం కాకుండా ఎడిట్ చేయడం విశేషం. ఏదో ఉందనే ఫీలింగ్ కలిగిస్తూనే సవాలక్ష డౌట్లు మిగిలిపోయేలా విజువల్స్ చూపించారు.

గత ఏడాది ఘాటీ డిజాస్టర్ తర్వాత అనుష్క మళ్ళీ కనిపించలేదు. దాని ప్రమోషన్లకు సైతం హాజరు కాలేదు. మరి కథానార్ కోసమైనా బయటికి వస్తుందేమో చూడాలి. మొత్తం 15 భాషల్లో విడుదలకు రెడీ అవుతున్న ఈ హిస్టారికల్ డ్రామాకు రాహుల్ సుబ్రమణియన్ సంగీతం సమకూర్చారు. విడుదల తేదీ ఇంకా లాక్ చేయలేదు. మల్టీ లాంగ్వేజ్ కాబట్టి సానుకూలమైన సోలో రిలీజ్ కోసం నిర్మాతలు ట్రై చేస్తున్నారు. బహుశా వేసవిలోనే థియేటర్ రిలీజ్ ఉండొచ్చు.

పెళ్లి వార్తలు గట్టిగా తిరుగుతున్న టైంలో అనుష్క ఇలా దర్శనం ఇవ్వడం బాగుంది కానీ మీడియా కెమెరా ముందుకు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న స్వీటీ కనీసం పెళ్లిళ్లు, ఈవెంట్లకు కూడా రావడం లేదు. కారణాలు ఏమైనా ఓసారి తనను లైవ్ లో చూడాలని ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ బోలెడు ఉన్నారు. కథానార్ లో నీలి అనే పవర్ ఫుల్ పాత్రలో అనుష్క కనిపించనుంది. అందులో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట.