Movie News

ఒంటరి పోరాటం చేస్తున్న ఉస్తాద్ దర్శకుడు

ఉగాది, రంజాన్ పండగలు లక్ష్యంగా వారం ప్రీ పోన్ చేసుకుని మరీ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం కళ్ళముందు కనిపించేస్తోంది. నార్త్ అమెరికాలో కనీసం ఒక్క మిలియన్ మార్కు అయినా అందుకుంటుందా లేదానే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఏపీలో అయిదో రోజుకే టికెట్ రేట్లు సాధారణ స్థితికి తేవడం చూస్తే ట్రెండ్ ఎంత డౌన్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మాములుగా కలెక్షన్లను ప్రకటించే మైత్రి సంస్థ ఉస్తాద్ విషయంలో మౌనం పాటిస్తోంది.

సరే ప్రతి ఫలితం మన చేతుల్లో ఉండదు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేస్తూనే ఉండటం విశేషం. బిలో 18 ప్రీ టీనేజర్స్ తో ఛాట్ షో, ఫ్యాన్స్ తో కేకులు కట్ చేయించి సెలబ్రేషన్స్ జరుపుకోవడం, ఎవరు పిలిచినా కాదనకుండా పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం, శ్రీలీల-రాశిఖన్నాడేట్లు తీసుకుని వాళ్ళనూ ప్రచారంలో భాగం చేయడం, ప్రతి పాజిటివ్ ట్వీట్ కు స్పందిస్తూ సోషల్ మీడియాలో రిప్లై ఇవ్వడం, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు అవుతుంది.

ఇప్పటికీ హరీష్ శంకర్ నమ్ముతున్నది ఒకటే. తాను బెస్ట్ ఎంటర్ టైనర్ తీశానని. ఫీడ్ బ్యాక్స్, కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ ఖచ్చితంగా పికప్ అవుతుందనే నమ్మకంతో పబ్లిసిటీ ఆపకుండా చేస్తున్నారు. ఆదివారం ఏదో సక్సెస్ మీట్ అన్నారు కానీ అది జరగలేదు. పవన్ కళ్యాణ్ తిరిగి పాలనలో బిజీ అయిపోవడంతో ప్రత్యేకంగా ఈవెంట్లకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో వీలైతే ఈ వీకెండ్ ఇంకో ఈవెంట్ ఏదైనా సాధ్యమవుతుందేమోనని దర్శక నిర్మాతలు ట్రై చేస్తున్నారు.

లాభ నష్టాల సంగతి పక్కనపెడితే హరీష్ శంకర్ ఇంత నిర్విరామంగా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం మంచి విషయమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల రిజల్ట్ తెలిసిన మరుక్షణం కొందరు దర్శకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి నెలల తరబడి బయటికి రావడం లేదు. కానీ హరీష్ అలా చేయకుండా తన సినిమాను ఎంత పుష్ చేయాలో అంతకంటే ఎక్కువే ట్రై చేస్తున్నారు. అది పెద్ద ఎత్తున కలెక్షన్లుగా ఏ మేరకు మారుతుందనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.

This post was last modified on March 24, 2026 3:12 pm

Share

Recent Posts

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

19 minutes ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

4 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

5 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

6 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

6 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

7 hours ago