Movie News

కొత్త ట్రెండ్… కత్తెరకు పని తగ్గిపోతోంది

రెండున్నర గంటలు ఇండియన్ సినిమాకు స్టాండర్డ్ రన్ టైమ్. కొన్ని సినిమాలకు దాని మీద నిడివి పావుగంట పెరగొచ్చు. కొన్ని చిత్రాలకు తగ్గొచ్చు. ఒకప్పుడు చాలా వరకు రెండున్నర గంటలను మించే రన్ టైం ఉండేది. కానీ మధ్యలో నిడివి తగ్గించడం ట్రెండుగా మారింది. పెద్ద సినిమాలు స్టాండర్డ్ రన్‌టైమ్‌లోనే కొనసాగినా.. చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు రెండు రెండుంబావు గంటల నిడివికి తగ్గించేయడం కొన్నేళ్ల పాటు జరిగింది. ఇప్పటికీ ఆ నిడివితో సినిమాలు వస్తున్నాయి కానీ.. మిడ్ రేంజ్ చిత్రాలు, పెద్ద సినిమాలకు మాత్రం నిడివి అంతకంతకూ పెరిగిపోతోంది. 

ఒక దశలో మూడు గంటల సినిమా అంటే అమ్మో అనుకునేవారు. కానీ అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి చిత్రాలు మూడు గంటల నిడివితోనూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో రన్ టైం పెరిగినా పర్వాలేదని ఫిలిం మేకర్స్‌కు ధైర్యం వచ్చింది. ఐతే ఇప్పుడు రన్ టైం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. యానిమల్, పుష్ప-2 చిత్రాలు 3 గంటల 21 నిమిషాల నిడివితో విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలో విషయం ఉండాలే కానీ.. రన్ టైం అన్నది పెద్ద సమస్యే కాదని ఆ చిత్రాలు రుజువు చేశాయి. 

ఐతే ఇప్పుడు నిడివి మూడున్నర గంటలు దాటినా సమస్య లేదని దురంధర్, దురంధర్-2 చిత్రాలు నిరూపించాయి. ‘దురంధర్’ను మూడున్నర గంటల రన్‌టైంతో రిలీజ్ చేసిన ఆదిత్య ధర్.. పార్ట్-2కు ఇంకా ధీమాగా 3 గంటల 50 నిమిషాల రన్‌టైంతో ఫైనల్ కట్ రెడీ చేశాడు.

యాడ్స్, ఇంటర్వెల్ బ్రేక్.. ఇవన్నీ కూడా కలుపుకుంటే థియేటర్లలో ప్రేక్షకులు 4 గంటలకు పైగానే కూర్చుంటున్నారు. అయినా సరే ఏమాత్రం విసుగు రావట్లేదు. రోలింగ్ టైటిల్స్ పడుతున్నా సరే.. ఆడియన్స్ సీట్ల నుంచి లేవకుండా స్క్రీన్ క్లోజ్ అయ్యే వరకు ఎదురు చూస్తున్నారంటే ‘దురంధర్-2’ వారిని ఏ స్థాయిలో ఎంగేజ్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. 

రన్ టైం విషయంలో ‘దురంధర్’ ఫ్రాంఛైజీ ఫిలిం మేకర్లకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి కంటెంట్ ఉందనే ధీమా ఉంటే నిడివి ఎక్కువే ఉంచేయడానికి ఇకపై ఫిలిం మేకర్స్ వెనుకంజ వేయకపోవచ్చు. రన్ టైం తగ్గించడం కోసం మంచి సీన్లకు కోత పెట్టాల్సిన.. ఏ సీన్లు తీసేయాలా అని తలలు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలా అని ఎంగేజింగ్‌గా లేని సినిమాలను ఇలా లాంగ్ రన్ టైంతో రిలీజ్ చేస్తే అసలుకే మోసం వస్తుందన్న సంగతి మరువరాదు.

This post was last modified on March 24, 2026 3:18 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

2 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

3 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

4 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

5 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

5 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

6 hours ago