Movie News

ఈ లెక్కలో రాజమౌళి, నీల్ కంటే తోపు

​భారతీయ సినీ చరిత్రలో ఒక దర్శకుడు తన మొదటి మూడు సినిమాలతోనే వరుసగా 300 కోట్ల మార్కును దాటడం అనేది మొన్నటివరకు ఎవరూ సాధించని అరుదైన ఘనత. కానీ ఆదిత్య ధర్ ఇప్పుడు ఈ ఫీట్‌తో దేశంలోనే నంబర్ వన్ దర్శకుడిగా అవతరించారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దిగ్గజ దర్శకులకు కూడా సాధ్యం కాని రీతిలో, తీసిన ప్రతి సినిమాను కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా మార్చడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కేవలం నెంబర్లు కాకుండా, ఎంచుకునే కథలు, మేకింగ్ స్టైల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండును సెట్ చేస్తున్నాయి.

​ఆదిత్య ధర్ కెరీర్ ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (2018)తో మొదలైంది. ఒక డెబ్యూ డైరెక్టర్‌గా దేశభక్తి నేపథ్యంలో తీసిన ఆ సినిమా 342.06 కోట్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వచ్చిన ‘ధురంధర్ 1’ ఏకంగా 1300 కోట్ల క్లబ్‌లో చేరి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురంధర్ 2’ కేవలం నాలుగు రోజుల్లోనే 750 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఈ మూడు చిత్రాల సక్సెస్ గ్రాఫ్ చూస్తుంటే, ఆదిత్య ధర్ బాక్సాఫీస్ పల్స్ పక్కాగా పట్టుకున్నారని అర్థమవుతోంది.

​ఈ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం అతని టేకింగ్ లోని క్లారిటీ. స్పై థ్రిల్లర్స్ లేదా మిలిటరీ బ్యాక్‌డ్రాప్ కథలను ఎంచుకున్నప్పుడు విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా జాగ్రత్త పడతారు. రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోల ఇమేజ్‌ను కథకు తగ్గట్టుగా మల్చడంలో అతను సెట్ చేసుకున్న స్క్రీన్ ప్లే అద్భుతం. అనవసరమైన హంగులకు పోకుండా, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను సీట్లకు కట్టేయడం వల్లనే ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. ‘ధురంధర్ 2’ జోరు చూస్తుంటే, లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులు కనుమరుగవ్వడం ఖాయం.

​టెక్నికల్ అంశాల విషయంలోనూ ఆదిత్య ధర్ ఎక్కడా రాజీ పడరు. సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ యాక్షన్ కొరియోగ్రఫీలో ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేశారు. అందుకే ఆయన సినిమాలు కేవలం హిందీ బెల్ట్ లోనే కాకుండా, సౌత్ మార్కెట్ లో కూడా గట్టిగా సౌండ్ చేస్తున్నాయి.

గతంలో వచ్చిన భారీ చిత్రాల ఓపెనింగ్స్ రికార్డులను ‘ధురంధర్ 2’ సునాయాసంగా దాటేస్తున్నాయి. దీంతో ప్రస్తుతానికి ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుడిగా ఆయన పేరు మారుమోగిపోతోంది. ​కేవలం మూడు సినిమాల అనుభవంతోనే వెయ్యి కోట్ల మార్కెట్‌ను శాసించడం సామాన్యమైన విషయం కాదు. భవిష్యత్తులో ఈయన నుండి రాబోయే ప్రాజెక్టుల మీద అంచనాలు భారీగా ఉంటాయని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ ఎలాంటి కథలను డెవలప్ చేసుకుంటాడో చూడాలి.

This post was last modified on March 24, 2026 10:12 pm

Share

Recent Posts

లక్ష్మికి ఇంకొంచెం సమయం దొరికి ఉంటే

ఒకపక్క రజనీకాంత్ జైలర్ 2, ఇంకోవైపు ప్యాన్ ఇండియా మూవీ రణబాలి. రెండూ మంచి బజ్ తెచ్చుకున్నాయి. బడ్జెట్, బిజినెస్…

22 minutes ago

మేనకోడలి పెళ్లికి నో చెప్పిన జగన్?

ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఒక రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. ప్రజలకు స్ఫూర్తిగా నిలబడాల్సిన లీడర్.…

28 minutes ago

వెంకటేష్‌కు దూరమయ్యింది విజయ్‌కు వరమయ్యింది

దసరా సెలవులు ముగింపుకి వస్తున్న తరుణంలో ఒక విషయం బాగా అర్థమయ్యింది. సంక్రాంతి లాగా మరో కీలకమైన సీజన్ గా…

57 minutes ago

టిఎఫ్ఐ అభిమానులకు కిక్కు రాలేదు

దసరా అంటే సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ కు అతి పెద్ద పండగ. పది రోజుల దాకా సెలవులు ఉంటాయి కాబట్టి…

2 hours ago

నాగవంశీ జాక్‌పాట్ వెనుక అనిరుధ్?

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘జైలర్-2’కు విడుదల ముంగిట పెద్దగా హైప్ ఏమీ కనిపించలేదు. ఆ సినిమా ప్రోమోలు…

3 hours ago

రప్పా రప్పా మనకొద్దు… కూటమికి జై కొట్టండి

రప్పా రప్పా రాజకీయాలు మనకు వద్దని, రాష్ట్రాన్ని భయం నీడలో బతికే పరిస్థితికి తిరిగి తీసుకురావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు…

4 hours ago