నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి ఉంచినప్పటికీ మెయిన్ పాయింట్ ఏంటో అరటిపండు ఒలిచినట్టు అర్థమైపోయింది. నలభై వయసు దాటిన ఒక వ్యాపారవేత్తకి, చలాకీగా ఉండే ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయికి మధ్య లవ్ స్టోరీని దర్శకుడు వెంకీ అట్లూరి చాలా మెచ్యూర్డ్ గా చెప్పే ప్రయత్నం చేశారు.
నిజానికి ఇలా కథని రివీల్ చేయడానికి కారణం లేకపోలేదు. ఈ ట్విస్టుని థియేటర్ కోసం దాచి పెడితే నేరుగా చూసిన ఆడియన్స్ కి అది జీర్ణం కాకపోతే ఫలితం తేడా కొట్టొచ్చు. 1991లో యష్ చోప్రా ఈ పొరపాటు చేశారు. లమ్హేలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటను రెండు షేడ్స్ లో చూపించే ప్రయత్నంలో తిరస్కారం ఎదురుకున్నారు. సబ్జెక్టు పరంగా రెండో పెళ్లికి వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉంటే పర్వాలేదు కానీ మరీ ఇరవై సంవత్సరాలంటే అంత ఈజీగా డైజెస్ట్ చేసుకునేది కాదు.
సోషల్ మీడియాలో టీజర్ మీద అన్ని రకాల రియాక్షన్లు కనిపించాయి. నెటిజెన్లు పాజిటివ్, నెగటివ్ రెండు రకాలుగా రెస్పాండ్ అయ్యారు. కానీ ఇదింకా ప్రచారంలో తొలి ఘట్టమే కాబట్టి అప్పుడే ఒక అంచనాకు రాలేం కానీ ట్రైలర్ చూశాక మరింత క్లారిటీ వస్తుంది. అసలు సూర్యకి ఇందులో మొదటి భార్య ఉందా లేక వయసు మీరినా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉన్నాడా, సూర్య మమిత ఎలా కలుసుకుంటారు లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెంకీ అట్లూరి తెలివైన గేమ్ ఆడాడు.
జూలై విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కి థియేటర్ బిజినెస్ చాలా కీలకం కానుంది. ముఖ్యంగా తెలుగు మార్కెట్ మీద పట్టు కోల్పోయిన సూర్యకు దాన్ని తిరిగి తెచ్చిచ్చే బాధ్యత నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి మీద ఉంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఇలా ఏజ్ డిఫరెన్స్ తో కథలు రాసుకునే ట్రెండ్ మొదలవ్వడం ఖాయం. అన్నట్టు వెంకీ అట్లూరి టేకింగ్ తెగ నచ్చేసిన నెట్ ఫ్లిక్స్ తనతో పెద్ద బడ్జెట్ లో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసిందట నెట్ ఫ్లిక్స్. త్వరలోనే ప్రకటన రావొచ్చు.
This post was last modified on March 17, 2026 5:52 pm
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…