Movie News

ఇక్కడ మాత్రం శ్రీలీలపై రాశిదే పైచేయి

ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే మేకింగ్ టైంలో అంచనాలు ఉన్నా లేకపోయినా.. రిలీజ్ టైంకి అంతా మారిపోతుంది. ఈ సినిమా విషయంలోనూ అందుకు భిన్నంగా ఏమీ జరగట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. ‘ఉస్తాద్..’కు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చూడబోతున్నామని ట్రైలర్ చూస్తే అర్థమైంది.

ఇందులో ఇద్దరు హీరోయిన్లుండగా.. వారిలో ఎవరు హైలైట్ అవుతారన్నది ఆసక్తికరం. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు పేరుకే ఉంటారు. కొన్ని రొమాంటిక్, కామెడీ సీన్లలో కనిపించి.. పాటల్లో స్టెప్పులేసి వెళ్లిపోతుంటారు. ట్రైలర్లో శ్రీలీల, రాశి ఇద్దరూ కూడా పెద్దగా హైలైట్ అవ్వలేదు. ఐతే ట్రైలర్‌ను బట్టి చూస్తే.. శ్రీలీలనే మెయిన్ హీరోయిన్, రాశి సెకండ్ హీరోయిన్ అని అర్థమవుతోంది. ఆమె పాత్ర నిడివి కూడా తక్కువేనట.

ఐతే మొన్నటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం పూర్తిగా రాశిదే డామినేషన్ అయింది. అందుకు తన స్టైలింగే కారణం. సూపర్ హాట్‌గా తయారై వచ్చిన ఆమె.. కుర్రాళ్ల దృష్టిని పూర్తిగా తన వైపు తిప్పేసుకుంది. పాతతరం హీరోయిన్లలా తయారై వచ్చిన శ్రీలీల.. రాశి ముందు ముందు నిలవలేకపోయింది. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా రాశి ఫొటోలే కనిపిస్తున్నాయి. అంతగా తన గ్లామర్ హైలైట్ అయింది. సినిమాలో కూడా రాశి కనిపించినంత సేపు గ్లామర్ విందు చేయబోతోందని అర్థమవుతోంది. ‘ఎత్తరా కాలర్’ పాటకు సంబంధించిన ప్రోమోలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

శ్రీలీల ఎప్పుడూ కొంచెం ట్రెడిషనల్‌ లుక్స్‌లోనే కనిపిస్తూ ఉంటుంది. నార్త్ హీరోయిన్ల మాదిరి గ్లామర్ విందు చేయదు. రాశికి అలాంటి మొహమాటాలేమీ లేవు. మరి సినిమాలో లీడ్ హీరోయిన్ అయినప్పటికీ శ్రీలీల.. రాశిని డామినేట్ చేయగలదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సందేహాలకు ఇంకో రెండు రోజుల్లో సమాధానం తెలిసిపోతుంది.

This post was last modified on March 17, 2026 6:01 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

2 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

3 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

4 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

4 hours ago