Movie News

తమ్ముడితో హిట్టు కొడితే అన్నయ్యతో పక్కా

ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం. దురంధర్ ది రివెంజ్ పోటీ తీవ్రంగా ఉన్నా, అనుకున్న స్థాయిలో ఓజి తరహా హైప్ లేకపోయినా కంటెంట్ తో కొడతామనే నమ్మకం టన్నుల్లో ఉంది. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఏపీ, ఓవర్సీస్ లో తెల్లవారుఝామున పడబోయే బెనిఫిట్ షోలతో ఉస్తాద్ భగత్ సింగ్ జాతకం ఏంటో సూర్యుడి రాక ముందే తెలిసిపోతుంది.

ఇదిలా ఉండగా హరీష్ శంకర్ త్వరలోనే చిరంజీవితో సినిమా చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, దొంగ మొగుడు తరహా క్యారక్టరైజేషన్ తో తప్పకుండ తీసి తీరుతానని నొక్కి వక్కాణించారు. అయితే ఇది జరగాలంటే ముందు ఉస్తాద్ బ్లాక్ బస్టరవ్వాలి. రికార్డులు రాయాలి. గబ్బర్ సింగ్ ని మరిపించేలా కలెక్షన్ల వర్షం కురిపించాలి. అప్పుడే హరీష్ మీద నమ్మకం బలపడుతుంది. ఎందుకంటే మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ మాములుగా పడలేదు కాబట్టి.

వయసు దృష్టిలో పెట్టుకుని దర్శకుల ఎంపికలో చిరంజీవి చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. మొహమాటం, నిర్లక్ష్యం వల్ల చేసిన భోళా శంకర్ ఎంత పెద్ద డ్యామేజ్ చేసిందో ఆయనకు తెలియంది కాదు. దెబ్బకు రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని మన శంకరవరప్రసాద్ గారితో తిరిగి ట్రాక్ లోకి వచ్చారు. నెక్స్ట్ వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ డైరెక్షన్లో మెగా 158 ఈ నెలలోనే స్టార్ట్ కానుంది. ఆ తర్వాత దసరా, ప్యారడైజ్ తీసిన శ్రీకాంత్ ఓదెల సెట్లో అడుగు పెట్టాలి.

చిరు ప్లానింగ్ చూస్తుంటే ఏ చిన్న రిస్కుని తీసుకోవడానికి సిద్ధంగా లేని వైనం కనిపిస్తోంది. హరీష్ శంకర్ కు మాస్ ఎలిమెంట్స్ మీద గట్టి పట్టుంది. గబ్బర్ సింగ్ లోనే అది ఋజువయ్యింది. ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇదే తరహా ఫలితం అందుకుంటే హరీష్ శంకర్ కు తిరుగు ఉండదు. అసలే తన లిస్టులో బాలకృష్ణ, సల్మాన్ ఖాన్ లాంటి క్రేజీ హీరోలతో పాటు కెవిఎన్ లాంటి టాప్ ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర తీసుకున్న అడ్వాన్సులున్నాయి. ఒకవేళ నిజంగా హరీష్ స్క్రిప్ట్ రెడీ చేసుకన్నా చిరు మూవీ అంటే 2028 దాకా ఆగాల్సి వస్తుంది.

This post was last modified on March 17, 2026 11:18 pm

Share

Recent Posts

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

8 minutes ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

15 minutes ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

1 hour ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

2 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

2 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

4 hours ago