ఈ మధ్య పెద్ద సినిమాల నిడివి గురించిన వార్తలు భలే చక్కర్లు కొడుతున్నాయి. దురంధర్ మొన్నటి దాకా 3 గంటల 40 నిముషాలు అన్నారు. ఇప్పుడేమో ఏకంగా 4 గంటల 5 నిమిషాలంటూ కొత్త స్క్రీన్ షాట్లు తిప్పుతున్నారు. పెద్ది గురించి కూడా ఇలాంటి టాకే వస్తే యూనిట్ ఖండించే దాకా వెళ్ళింది పరిస్థితి. ఎడిటింగ్ టేబుల్ పక్కనే ఉండి తాము చూసినట్టు కొందరు న్యూస్ పుట్టిస్తున్న తీరు మహా విచిత్రంగా ఉంది.
టాక్సిక్ ని కూడా ఇది వదల్లేదు. 2 గంటల 50 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల దాకా లెన్త్ ఉంటుందనే తరహాలో రకరకాల లీకులు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చెప్పిన వాటన్నింటిలో నిజానిజాలు సదరు యూనిట్లు అఫీషియల్ గా చెప్తే తప్ప క్లారిటీ రాదు. ఇవి హాట్ టాపిక్ గా మారడానికి కారణాలు లేకపోలేదు. జనవరి సంక్రాంతి హడావిడి అయిపోయాక చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. దాంతో అందరి దృష్టి వీటిమీదే ఉంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మూవీ లవర్స్ లో ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతోంది.
ఎంత నిడివి ఉంటుందితో మొదలుపెట్టి క్లైమాక్స్ ఎంత ఖర్చు పెట్టి తీశారనే దాకా ప్రతిఒక్క అంశం మీద ఆసక్తి చూపిస్తున్నారు. రెండున్నర గంటలు థియేటర్లో కూర్చువడమే ఇప్పటి జనరేషన్ కు గొప్ప అనే భ్రమను సందీప్ రెడ్డి వంగా, సుకుమార్, ఆదిత్య ధార్ లాంటి దర్శకులు బద్దలు కొట్టారు. కంటెంట్ ఉంటే జనం ఎంతసేపైనా ఉంటారని ఋజువు చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే ప్యాన్ ఇండియా మూవీస్ గురించి ఈ మాత్రం హైప్ ఉండటం సహజం.
అయితే ఒక్కటి మాత్రం నిజం. ఇప్పటి డైరెక్టర్లు ఏ విషయంలోనూ కాంప్రోమైజ్ కావడం లేదు. ఖర్చు అయినా లెన్త్ అయినా తాము బలంగా నమ్మితే రాజీ సమస్యే లేదంటున్నారు. దానికి తగ్గట్టే గొప్ప ఫలితాలు అందుకుంటున్నారు. అలాని అందరికీ ఇది జరగడం లేదు. కాశ్మీర్ ఫైల్స్ రేంజ్ లో ఆడుతుందని బెంగాల్ ఫైల్స్ ని మూడున్నర గంటలు తీస్తే హిందీలో మూడు రోజులు కూడా నిలబడలేదు. ఆ కన్విన్సింగ్ టాలెంట్ అందరికీ ఉండదు. అందుకే మనోళ్లు ప్రత్యేక ముద్ర వేసి నార్త్ నుంచి సౌత్ దాకా అశేష అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.
This post was last modified on March 3, 2026 7:14 pm
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…