ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెనక్కి తగ్గకపోగా.. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూ నివాసంపైనా ఇరాన్ దాడులు చేసిందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ఈ యుద్ధం కొనసాగుతుందని.. మరింత భీకరంగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వారం పది రోజులు సాగే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాదు.. అమెరికా సైనికులు మరింత మంది తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి ఉంటుందని కూడా ట్రంప్ కుండబద్దలు కొట్టారు.
ఇదిలావుంటే.. ప్రపంచ దేశాల్లో ఎక్కడా యుద్ధాన్ని అభిలషించేది లేదన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం అయినా.. ఇజ్రాయెల్-గాజా యుద్ధమైనా.. ఖండించారు. తటస్థంగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక దశలో ఉక్రెయిన్-రష్యాల మధ్య మధ్యవర్తిత్తం చేసేందుకు కూడా మోడీ ముందుకు వచ్చారు. రష్యా అధ్యక్షుడిని కూడాదేశానికి పిలిచి చర్చించారు. కానీ.. తాజాగా పశ్చిమాసియా విషయానికి వస్తే.. ఒకింత భిన్నమైన మార్గంలో మోడీ అడుగులు వేస్తున్నారన్న చర్చ జోరుగా తెరమీదికి వచ్చింది. జాతీయ మీడియాలో పలు కథనాలు కూడా వస్తున్నాయి.
దీనికి కారణం.. ఆది నుంచి ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి సరికాదన్న వాదన నుంచి ఇప్పుడు ఏకపక్షం దిశగా మోడీ అడుగులు పడుతున్నాయి. తాజాగా గల్ఫ్ దేశాల అధినేతలతో ప్రధాని వరుసగా ఫోన్లు మాట్లాడారు. ఆయా దేశాలకు భరోసా ఇచ్చారు. బెహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలపై ఇరాన్ చేసిన దాడులను ప్రధాన మంత్రి ఖండించారు. ఈ దాడులు సరికావని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమయంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూతోనూ ప్రధాన మంత్రి ఫోన్‌లో సంభాషించా రు. ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.
వాస్తవానికి ఇప్పటి వరకు యుద్ధం జరుగుతున్న దేశాలతో భారత్ అంటీముట్టనట్టే వ్యవహరించింది. నేరుగా వారికి మద్దతు పలకడం.. క్షేమ సమాచారాలు తెలుసుకోవడం వంటివి లేదు. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి జోక్యం చేసుకోవడం.. ఇరాన్‌ను వదిలేసి.. ఇతర దేశాలకు మద్దతుగా వ్యవహరించడం.. దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోందని జాతీయ మీడియా పేర్కొంటోంది. దీని వెనుక అమెరికా ఒత్తిడి ఉండి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అప్పుడే విమర్శలు కూడా చేస్తున్నాయి. ఏదేమైనా.. శాంతి మంత్రం పఠించే దేశం.. ఇప్పుడు కొన్ని దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు రావడం గమనార్హం.
This post was last modified on March 3, 2026 7:34 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…