Movie News

ఆలస్యంగా నిద్రలేచిన అన్నగారు

ఇప్పుడంతా ఫాస్ట్ యుగం. టెక్నాలజీ అయినా సినిమా అయినా ఎక్స్ పైరీ డేట్ వేగంగా వస్తోంది. ఒకప్పటిలా వంద రోజులు ఆడే కాలం కాదిది. ఓటిటిలోనూ అంతే. ఎంత బ్లాక్ బస్టర్ అయినా వ్యూస్ మొత్తం మొదటి వారంలోనే వచ్చేయాలి. తర్వాత పెద్దగా చూసేవాళ్ళు ఉండరు. ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం. కానీ కార్తీ టీమ్ ఈ సూత్రాన్ని విస్మరించింది. జనవరిలో సంక్రాంతికి విడుదలైన వా వతియర్ తెలుగులో థియేట్రికల్ రిలీజ్ జరుపుకోని సంగతి తెలిసిందే.

తమిళంలో డిజాస్టర్ కావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. రెండు వారాలకే అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ తో పాటు ప్రధాన బాషల వెర్షన్లు అందుబాటులోకి తెచ్చారు. ఆ టైంలోనే డబ్బింగ్ మీద విమర్శలు వచ్చాయి. సినిమాలో ఉన్న కోలీవుడ్ లెజెండరీ యాక్టర్ ఎంజిఆర్ రెఫరెన్సులు ఏ మాత్రం మార్చకుండా డైలాగుల్లో మాత్రమే ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి ఖంగాళీ చేయడం పట్ల భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ్లాప్ మూవీ కాబట్టి జనం పెద్దగా పట్టించుకోలేదు. మాములుగా ఇలాంటి విషయాల్లో కార్తీ శ్రద్ధ తీసుకుంటాడు. కానీ ఫలితం వల్లేమో పట్టించుకోలేదు. ఇప్పుడు అన్నగారు వస్తారు అసలు వెర్షన్ ని అందుబాటులోకి తెస్తున్నారు. అంటే ఎంజిఆర్ ఫోటోలు, వీడియోల స్థానంలో మన స్వర్గీయ ఎన్టీఆర్ ని చూడబోతున్నాం అన్న మాట. ఈ పనేదో అప్పుడే చేసి ఉంటే కామెంట్స్ వచ్చేవి కాదు. అసలే టైటిల్స్ తో సహా తమిళ పేర్లు యధావిధిగా పెడుతున్నారనే నెగటివిటీ ఈ మధ్య డబ్బింగ్ సినిమాల విషయంలో బాగా పెరిగిపోయింది.

కానీ వా వతియర్ అన్నగారు వస్తారుగా మార్చి మంచి పని చేసిన నిర్మాత తీరా మెయిన్ మూవీలో ఎంజిఆర్ ని అలాగే ఉంచడం అస్సలు బాలేదు. ఎక్కాల్సిన రైలు జీవితం కాలం లేటు అన్నట్టు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇప్పుడీ కారణంగా హఠాత్తుగా వ్యూస్ పెరగడం జరగవు కానీ ఇకపై మాత్రం ఇలాంటి విషయాల్లో ప్రొడ్యూసర్లు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అలా చేస్తే లేటుగా నిద్ర లేచే అవసరం ఉండదు. మళ్ళీ కొత్తగా మాటలు పడే అవసరం అసలే రాదు. ఈ మాత్రం చేయడం కూడా మంచిదే.

This post was last modified on March 3, 2026 10:37 pm

Share

Recent Posts

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

9 minutes ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

8 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

10 hours ago