ఏప్రిల్ 30 విడుదల తేదీ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు టీమ్ మాత్రం వాయిదా సమస్యే లేదని చెబుతోంది. ఇప్పటికే మార్చి 27 వదులుకోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచినప్పటికీ నెల రోజుల ఆలస్యమే కాబట్టి పెద్దగా ఫీలవ్వలేదు. క్రమంగా ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు లాక్ అవుతున్నారు. కొన్ని చోట్ల ఆర్ఆర్ఆర్ కు దగ్గరగా రేట్ పలుకుతోందని వినికిడి.
పలువురు డిస్ట్రిబ్యూటర్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ఇచ్చేందుకు సైతం వెనుకాడటం లేదంటే ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పెద్ది మీదున్న హైప్ దృష్ట్యా వేరొకరు దానికి పోటీగా వచ్చే ఉద్దేశంలో లేరు. అందుకే ఇతర సినిమాలు సైలెంట్ ఉన్నాయి. ఇక్కడ సంగతేమో కానీ అదే ఏప్రిల్ 30 ధనుష్ తన కరతో రాబోతున్నాడు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. విగ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిందే.
గ్రామీణ నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. ఒక పల్లెటూరిలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. హీరోయిన్ మమిత బైజుతో పాటు శరత్ కుమార్, జయరాజ్ లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నాడు. అంచనాల పరంగా మరో అసురన్, కర్ణన్ అవుతుందనే స్థాయిలో కోలీవుడ్ లో మాట్లాడుతున్నారు. రిలీజ్ కూడా పెద్ద ఎత్తున ప్లానింగ్ అవుతోంది.
మన దగ్గర సమస్య లేదు. ఎందుకంటే ధనుష్ మార్కెట్ తెలుగులో బాగా అప్ అండ్ డౌన్ అవుతోంది. సార్ సూపర్ హిట్ అయ్యింది కానీ రాయన్ ఆశించిన ఫలితం అందుకోలేదు. ఇడ్లీ కొట్టు దారుణంగా పోయింది. తను డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా కూడా సోసోగానే ఆడింది.
అందుకే కర వల్ల పెద్దికి ఏపీ తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది రాదు కానీ తమిళనాడు, కేరళ థియేటర్లలో కొంత కోత పడుతుంది. కాంపిటీషన్ సంగతి ఎలా ఉన్నా పెద్ది మాట తప్పకుండా ఏప్రిల్ 30 వచ్చేయాలని మెగా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికకు తగ్గట్టు బుచ్చిబాబు డే అండ్ నైట్ అయితే కష్టపడుతున్నారు.
This post was last modified on March 2, 2026 8:09 pm
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…