టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు బిరియాని అంటే ఎంత ప్రేమో చాలా సందర్భాల్లో చెప్పాడు తారక్. అలాగే అతడికి చాలా ఇష్టమైన చిరు తిళ్లలో పునుగులు కూడా ఒకటి. వాటిని ఎంత ఇష్టంగా తింటానో తారక్ బయట పెట్టాడు. ఇక తాను బాగా తినడమే కాక.. అందరికీ మంచి ఫుడ్ పెడతాడని పేరున్న ప్రభాస్ సైతం పునుగులను చాలా ఇష్టపడతాడట.
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ని ప్రమోట్ చేయడం కోసం ఆ టీంతో కలిసి ఒక చిట్ చాట్ వీడియో చేసిన ప్రభాస్.. అందులో తన పునుగుల ప్రేమ గురించి వెల్లడించాడు ప్రభాస్. ప్రతి ఊరూ ఒక స్పెషల్ ఫుడ్‌కు ఫేమస్ అయి ఉంటుందని.. అలా విజయవాడ పునుగులకు ఫేమస్ అని ప్రభాస్ అన్నాడు. తనకు చిన్నతనం నుంచి విజయవాడలో పునుగులు చాలా ఇష్టమని అతను వెల్లడించాడు.
తన క్లోజ్ ఫ్రెండ్ అయిన యువి క్రియేషన్స్ అధినేత ప్రమోద్‌తో కలిసి తాను పునుగులను భలేగా ఎంజాయ్ చేసేవాడినని చెప్పాడు. ప్రమోద్ తండ్రి సాయంత్రాల్లో తనను, ప్రమోద్‌ను తన వెస్పా స్కూటర్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్లి ఆ పునుగులు తినిపించేవాడని ప్రభాస్ చెప్పాడు. పునుగులు చాలా చోట్ల ఉండొచ్చని.. కానీ విజయవాడలో చిన్న చిన్నగా చేస్తారని.. ప్లేట్లో వాటి మీద చట్నీ వేసి ఇస్తారని.. ఆ టేస్టే వేరని ప్రభాస్ అన్నాడు. ఇలా చెబుతూ చెబుతూ.. ఇప్పుడు తనకు నోటిలో నీళ్లు ఊరిపోతున్నాయని.. పునుగులు తినాలని అనిపిస్తోందని ప్రభాస్ చెప్పడం విశేషం.
హైదరాబాద్‌లో ఉన్నా సరే.. తనకు విజయవాడలో వెళ్లి పునుగులు తినాలనిపిస్తుందని.. షూటింగ్‌ల కోసం కార్లో వెళ్తూ ఉన్నపుడు అక్కడ ఆగి తినాలని అనుకుంటానని ప్రభాస్ చెప్పాడు. ఐతే చాలా వరకు తాను రాత్రిళ్లే ప్రయాణాలు చేస్తా కాబట్టి.. తాను విజయవాడకు వెళ్లే సమయానికి అక్కడ పునుగులు ఉండవని ప్రభాస్ ఒకింత బాధగా చెప్పుకుంది.
This post was last modified on February 20, 2026 3:55 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…