Movie News

వారణాసి కానుకలు… తప్పని షరతులు

ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్ మీద జరగకుండా పోయి రెండు సంవత్సరాలు దాటేసింది. రాజమౌళి కోసం ఇలాంటి త్యాగాలు గతంలో ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు చేశారు కాబట్టి ఇప్పుడు మహేష్ కీ తప్పడం లేదు. సరే ప్యాన్ వరల్డ్ మూవీకి ఇవి సహజం కాబట్టి పోన్లేని సర్దుకుని ఫ్యాన్స్ 2027 ఏప్రిల్ 7 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో బర్త్ డే రావడం ఖచ్చితంగా మంచి అకేషన్.

సో వారణాసి నుంచి టీజర్ లాంటిది రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ అలాంటిదేమి ఉండకపోవచ్చట. రెండు కొత్త పోస్టర్లతో శుభాకాంక్షలు చెప్పడం తప్ప ప్రత్యేకంగా ఎలాంటి వీడియో కంటెంట్ రాదని విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే జక్కన్న పెర్ఫెక్షన్ కోసం తపించే మనిషి. తాను కోరుకున్న క్వాలిటీ వచ్చే వరకు చిన్న స్టిల్ కూడా బయటికి వదలరు. అలాంటిది ఏకంగా టీజర్ అంటే ఆషామాషీ కాదు. అందుకే రావడం లేదని టాక్.

గతంలో చరణ్, తారక్ బర్త్ డేలకు విడివిడిగా ఆర్ఆర్ఆర్ టీజర్లు విడుదల చేసిన సందర్భాన్ని మహేష్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అయితే వారణాసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పీక్స్ లో ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రత్యేకంగా టీజర్ కట్ చేసే సమయం రాజమౌళి బృందానికి లేదు. పైగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ పనుల్లో కార్తికేయ కూడా బిజీగా ఉన్నాడట. కాబట్టి మహేష్ పుట్టినరోజని ఏదోకటి హడావిడిగా చేయడం ఇష్టం లేకే పోస్టర్స్ సిద్ధంగా చేశారని అంటున్నారు.

వచ్చే సంవత్సరం ఇంకో పుట్టినరోజు వచ్చేలోపల వారాణసి థియేటర్ రన్ అయిపోయి అప్పటికి ఓటిటిలో వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఈ ఏడాదే ఏదైనా స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చి ఉండాల్సిందని మూవీ లవర్స్ కోరుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు. ముందు అనుకున్న పోకిరి రీ రిలీజ్ కాకుండా ఈసారి దూకుడుతో సెలబ్రేషన్స్ జరగనున్నాయి. గత ఏడాది అతడు ఆశించిన పెద్ద స్థాయిలో ఆడలేదు. మరి దూకుడు ఏమైనా రికార్డులు చేస్తుందేమో చూడాలి. 

This post was last modified on August 5, 2026 12:41 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

3 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

4 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

4 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

6 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

8 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

9 hours ago