యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు సినిమాలు పెట్టుకునే ఉంటాడు. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ అతడికి మంచి డిమాండే ఉంది. మంచి బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తుంటారు నిర్మాతలు. ఇప్పటికే తెలుగులో ‘పవర్ పేట’ అనే పెద్ద బడ్జెట్ సినిమా చేస్తున్నాడు సందీప్. ఇక తమిళంలో సీఎం విజయ్ తనయుడు జేసన్ విజయ్ దర్శకత్వంలో నటించిన ‘సిగ్మా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు సందీప్ నుంచి ఇంకో భారీ చిత్రం అనౌన్స్ అయింది. ఆ సినిమానే.. కరికాల.
గత ఏడాది ‘శంబాల’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు యుగంధర్ ముని. అతడి తొలి చిత్రం ‘ఎ (యాడ్ ఇన్ఫినిటమ్) కూడా మంచి ప్రయోగంగా గుర్తింపు తెచ్చుకుంది. ‘శంబాల’ మంచి హిట్ కావడంతో యుగంధర్‌పై నిర్మాతలకు గురి కుదిరింది. ‘శంబాల’ను ప్రొడ్యూస్ చేసిన మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నాభిమోజులే.. యుగంధర్ ముని, సందీప్ కిషన్‌ల కలయికలో రాబోతున్న ‘కరికాల’ను కూడా నిర్మిస్తున్నారు. ఈ రోజే ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. రెండూ ఆకర్షణీయంగానే ఉన్నాయి.
సింహాన్ని తరుముతూ గుర్రం మీద దూసుకొస్తున్న యోధుడి అవతారంలో సందీప్ కిషన్ ఆకట్టుకున్నాడు. ‘కరికాల’కు ‘ఎ మ్యాజికల్ వరల్డ్’ అనే క్యాప్షన్ పెట్టారు. దీన్ని బట్టి ఒక అద్భుత ప్రపంచంలోకి ప్రేక్షకులను విహరిపంజేయబోతున్నామని సంకేతాలు ఇచ్చినట్లయింది. సినిమా అనౌన్స్‌మెంట్లోనే ఇది రెండు భాగాలుగా వస్తుందని చెబుతూ.. రెండు భాగాల రిలీజ్ డేట్లను కూడా అనౌన్స్ చేయడం విశేషం. చాప్టర్-1 2027 జులై 2న, చాప్టర్-2 అదే ఏడాది అక్టోబరు 28న సుమారు నాలుగు నెలల గ్యాప్ తో రిలీజవుతాయని ప్రకటించారు. మరి సందీప్ కెరీర్లోనే అత్యంత భారీగా తెరకెక్కనున్న ‘కరికాల’ అతడి కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుందేమో చూడాలి.
This post was last modified on August 5, 2026 12:37 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…