మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో ఇప్పటికే చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ చాలా మంది మంత్రులు మౌనంగా ఉండడం.. కనీసం పన్నెత్తు విమర్శ కూడా చేయకపోవడంతో సీఎం మరోసారి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయమే టెలీ కాన్ఫరెన్సు నిర్వహించిన సీఎం చంద్రబాబు.. మంత్రులకు వారి బాధ్యతలను గుర్తు చేసినట్టు తెలిసింది.
ఫైళ్ల క్లియరెన్సు, శాఖలపై పట్టు విషయంలో రెండున్నరేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఐదుగురు టీడీపీ మంత్రులు పట్టు పెంచుకోలేక పోయారని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక, ప్రత్యర్థులు చేస్తున్న దాడిని ఎదుర్కొనడంలో దాదాపు సగం మంది మౌనంగానే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకా.. ప్రతి విషయాన్నీ తాను చెప్పాలంటే కుదరదని.. ఇక నుంచి అయినా.. మిషన్ మోడ్‌తో పనిచేయాలని సూచించారు. ప్రత్యర్థులు రెచ్చిపోతున్నా.. మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
ఇక, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రులకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఒక్క చోట కూడా.. కూటమి పార్టీలు ఓటమి చవి చూడకూడదని స్పష్టం చేశారు. ఎవరూ అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. అదే సమయంలో మీడియా ముందుకు రావడం.. ప్రజలకు మంచిని వివరించడం చేయాలని చెప్పారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా.. దాని తాలూకు ఫలితం ఓట్ల రూపంలో మారకపోతే.. ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
నేనే స్వయంగా..
తానే స్వయంగా మంత్రుల పనితీరును పరిశీలించనున్నట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాల ఇంచార్జ్ మంత్రులు.. అసలు జిల్లాల్లో పర్యటించడం లేదని తనకు నివేదికలు అందాయన్నారు. ముఖ్యంగా అంతర్గత పోరును తగ్గించాలని చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇది సరికాదన్న ఆయన `పనితీరు మెరుగు పరుచుకోని వారు.. ఆలోచన చేసుకోవాలి“ అని పరోక్షంగా హెచ్చరించారు. వచ్చే స్థానిక ఎన్నికల తర్వాత.. ఫలితాన్ని బట్టి మార్పులు ఉండే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా మంత్రి వర్గ ప్రక్షాళనపై సంకేతాలు ఇచ్చేశారు.
This post was last modified on August 5, 2026 12:49 pm
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…