ఒక హీరో వరుసగా డిజాస్టర్లు ఇచ్చినపుడు.. తన చివరి హిట్ ఎప్పుడో తన అభిమానులు కూడా మరిచిపోయినపుడు.. అతను కొత్తగా జట్టు కట్టిన దర్శకుడు కూడా ఫ్లాపుల్లో ఉన్నపుడు రాబోయే సినిమాకు బజ్ క్రియేట్ కావడం అంత తేలిక కాదు. అలాగే బిజినెస్ పరంగా కూడా ఇబ్బందులు తప్పవు. కానీ వరుణ్ తేజ్ కొత్త సినిమా కొరియన్ కనకరాజుకు మాత్రం ఇటు ప్రేక్షకుల్లో మంచి హైప్ వచ్చింది. అటు ట్రేడ్ వర్గాల్లో బాగానే డిమాండ్ ఏర్పడింది.
వరుణ్ చివరగా 2019లో గద్దలకొండ గణేష్ మూవీతో హిట్టు కొట్టాడు. ఆ తర్వాత తన నుంచి వచ్చిన సోలో హీరో సినిమాలు గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా.. ఒకదాన్ని మించి ఒకటయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన లాగే ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న మేర్లపాక గాంధీతో అతను సినిమా ఓకే చేశాడు.
ఈ చిత్రం మొదలైనపుడు, మేకింగ్ దశలో అంతగా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించలేదు. కానీ టీజర్, ట్రైలర్ క్రేజీగా ఉండడం.. ఎంటర్టైన్మెంట్‌కు ఢోకా లేని సినిమాలా కనిపించడం.. వరుణ్-సత్య కలిసి చేసిన ప్రమోషన్లు.. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వీళ్ల మధ్య వర్కవుటైన కెమిస్ట్రీ సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. ఈ శుక్రవారం రిలీజయ్యే ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది.
దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టినట్లు సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్ మంచి రేటు పలికాయి. థియేటర్ల మీద తక్కువ భారమే ఉంది. 13 కోట్ల షేర్ వస్తే బయ్యర్లు సేఫ్ అయిపోతారట. సినిమాకు మంచి బజ్ ఉంది కాబట్టి ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండదు. హిట్ టాక్ వస్తే మంచి లాభాలు ఖాయం. వరుణ్ సరసన రితిక యాదవ్ నటించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్‌తో కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.
This post was last modified on August 5, 2026 11:11 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…